తుఫాన్ ముప్పు తప్పింది

 

మచిలీపట్నం ఏప్రిల్ 29 (globelmedianews.com)
ఫణి తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో మచిలీపట్నం మంగినపూడి బీచ్ వద్ద నెలకొన్న పరిస్థితులను కలెక్టర్ ఎ. ఎండి. ఇంతియాజ్ సోమవారం పరిశీలించారు.  బీచ్ వద్ద అలల ఉదృతిని కలెక్టర్ పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. తరువాత అయన మీడియాతో మాట్లాడారు. కృష్ణాజిల్లాకు ఫణి ముప్పు లేనట్టేనని అయన అన్నారు.


తుఫాన్ ముప్పు తప్పింది

వాతావరణ శాఖ జారీ చేసిన తాజా బులిటెన్ ప్రకారం జిల్లాకు ఫణి ముప్పు దాదాపు తప్పినట్టైంది. ప్రస్తుతం తుఫాన్ ఉత్తర దిశగా పయనిస్తోందని అన్నారు. ఒకవేళ తుఫాన్ దిశ మార్చుకుంటే దాన్ని ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగం సంసిద్దంగా ఉంది. తీరం దాటే వరకు అప్రమత్తంగా ఉంటాం. ప్రస్తుతానికి జిల్లాలో సాధారణ పరిస్థితులే నెలకొన్నాయి. అయినా తీరంలో అన్ని శాఖల అధికారులను అప్రమత్తం చేశామని కలెక్టర్ అన్నారు.

No comments:
Write comments