గుర్తింపు కార్డులు ఇవే

 

కర్నూలు, ఏప్రిల్,09 (globelmedianews.com):
ఓటరు జాబితాలో పేరుండి, ఫోటో ఓటరు గుర్తింపు కార్డ లేకపోతే ఓటర్లు ఆందోళన పడాల్సిన పనిలేదు. భారత ఎన్నికల సంఘం సూచించి 11 రకాల ప్రత్సామ్నాయ గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకటి చూపించి ఓటర్లు నిర్భయంగా ఓటు వేయవచ్చునని జిల్లా ఎన్నికల అధికారి, కాలెక్టర్ యస్.సత్యనారాయణ మంగళవారం ఒక ప్రకటనలో తేలిపారు.


గుర్తింపు కార్డులు ఇవే

అందులో 1. ఆధార్ కార్డు 2. డ్రైవింగ్ లైసెన్స్,  3.పాస్ పోర్టు  4. పాన్ కార్డు  5.బ్యాంక్ లు,  పోస్టుఫీస్ జారీ చేసిన ఫోటో పుస్తకలు  6. ఫోటో గల పింఛను పత్రం 7. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు, సిఎస్ యులు, పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలు ఉద్యోగు లకు జారీ చేసిన ఫోటో గల సర్వీపు గుర్తింపు కార్డులు 8. మహాత్మ గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామి పథకం జాబ్ కార్డ్  9.ఎన్ పిఆర్ కింద ఆర్ జిఐ జారీ చేసిన స్మార్ట్ కార్డ్  10. కార్మిక మంత్రిత్వ శాఖ పధకం కింద జారీ చేసిన ఆరోగ్య భీమా స్మార్ట్ కార్డ్   11.ఎంపిలు, ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలు జారీ చేసిన అధికారి గుర్తింపు కార్డులలో ఏదో ఒక గుర్తింపు కార్డు చూపించి ఓటు వేయవచ్చునని ఆయన ఆ ప్రకటనలో తెలిపారు.

No comments:
Write comments