ఎస్పీవై రెడ్డి ఆరోగ్య పరిస్థితి విషమం

 

హైదరాబాద్, ఏప్రిల్ 8 (globelmedianews.com)
సార్వత్రిక ఎన్నికల్లో నంద్యాల లోక్సభ స్థానం నుంచి జనసేన పార్టీ తరపున బరిలోకి దిగిన సిట్టింగ్ ఎంపీ ఎస్పీవై రెడ్డి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. అస్వస్థతకు గురైన ఎస్పీవై రెడ్డిని గత మంగళవారం నంద్యాల నుంచి హైదరాబాద్కు తరలించారు. 


ఎస్పీవై రెడ్డి ఆరోగ్య పరిస్థితి విషమం

అయినా ఆయన ఆరోగ్యపరిస్థితి మెరుగుపడలేదు. ప్రస్తుతం బంజారాహిల్స్లోని కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఎస్పీవై రెడ్డి పరిస్థితి విషమంగా ఉండగా… ఆయనకు ఐసీయూలో చికిత్స  అందిస్తున్నారు. కాగా, గత ఎన్నికల్లో వైసీపీ నుంచి నంద్యాల ఎంపీగా గెలిచిన ఎస్పీవై రెడ్డి అనంతరం టీడీపీలో చేరారు. అయితే, ఈ ఎన్నికల్లో ఆయనకు టీడీపీ టికెట్ కేటాయించకపోవడంతో జనసేన పార్టీలో చేరి నంద్యాల ఎంపీగా బరిలోకి ఉన్నారు.

No comments:
Write comments