విద్యాసాగర్ రావు జీవితం ఆదర్శం….

 

మంత్రి నిరంజన్ రెడ్డి
వనపర్తి, ఏప్రిల్ 29 (globelmedianews.com)  
ఎక్కడెక్కడ నీటి పంపిణీలో అన్యాయం జరిగిందో తెలంగాణ ప్రజలకు అర్ధమయ్యేలా వివరించి తెలంగాణ రాష్ట్ర సాధనలో తన వంతు పాత్ర పోషించి, ముఖ్యమంత్రి కేసీఆర్ తో అడుగులు వేసిన సాగునీటి రంగ నిపుణులు, రిటైర్డు చీఫ్ ఇంజనీర్ కీర్తిశేషులు ఆర్.విద్యాసాగర్ రావు  జీవితం ఆదర్శనీయమని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖా  మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి  అన్నారు. ఆర్.విద్యాసాగర్ రావు  రెండో వర్ధంతి సంధర్భంగా ఆయన చిత్రపటానికి సోమవారం వనపర్తి పట్టణంలోని తన స్వగృహంలో పార్టీ శ్రేణులతో కలిసి నివాళులు అర్పించారు. 


విద్యాసాగర్ రావు జీవితం ఆదర్శం….

తెలంగాణ నీటి లెక్కలను తేల్చిన విద్యాసాగర్ రావు స్వరాష్ట్రంలో తెలంగాణ ఇప్పుడు నష్టపోయిన నీళ్లను తెచ్చుకునే సమయంలో లేకపోవడం బాధాకరం అని అన్నారు. తెలంగాణకు నీటి కేటాయింపులపై జరిగిన అన్యాయాన్ని అనేక దినపత్రికలలో వందకు పైగా వ్యాసాలు రాశారని, నీళ్లు - నిజాలు పేరుతో వెలువరించిన రెండు సంపుటాలను చదివితే తెలంగాణ ఎంత నష్టపోయింది అన్నది స్పష్టంగా అర్ధమవుతుందని నిరంజన్ రెడ్డి చెప్పారు.  ఉద్యమ సమయంలో సాగునీటి రంగంలో ఆయన ప్రముఖపాత్ర పోషించారని, పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన సాంకేతిక సమస్యలను కూడా తన రచనలలో వివరించారని అన్నారు. 2014లో ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ (భారతదేశం) ఆయనను "లీడింగ్ ఇంజనీరింగ్ పెర్సనాలిటీస్ ఆఫ్ ఇండియా పురస్కారంతో సన్మానించిందని, ఆయన మరణం తెలంగాణకు తీరనిలోటని నిరంజన్ రెడ్డి వివరించారు.  

No comments:
Write comments