అనంతపురంలో సైకిల్ జోరేనా...

 

అనంతపురం, ఏప్రిల్ 30 (globelmedianews.com
పార్టీ ఆవిర్భావం నుంచి ఇక్కడ తెలుగుదేశం పార్టీయే గెలుస్తుంది. 1989లో తప్ప ఇప్పటి వరకూ జరిగిన అన్ని ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీదే విజయం. అభ్యర్థులు ఎవరన్నది ఇక్కడ ముఖ్యం కాదు. పసుపు జెండాకే జై కొడతారు ఇక్కడి జనం. అదే అనంతపురం జిల్లా పెనుకొండ నియోజకవర్గం. 1985 నుంచి తెలుగుదేశం పార్టీ ఇప్పటి వరకూ ఎనిమిది సార్లు గెలిచిందంటే పార్టీకి పట్టున్న చెప్పకనే తెలుస్తోంది. అయితే ఈసారి కూడా తెలుగుదేశం పార్టీకి విజయావకాశాలున్నట్లు అంచనాలు వెలువడుతున్నాయి. కియా పరిశ్రమ రావడంతో ఇక పెనుకొండలో మరోసారి పసుపు జెండా ఎగరం ఖాయమంటున్నారు తెలుగుతమ్ముళ్లు.పెనుకొండ నియోజకవర్గం ఆది నుంచి తెలుగుదేశం పార్టీకి పెట్టని కోట. ఎన్టీరామారావు తెలుగుదేశం పార్టీ స్థాపించిన నాటి నుంచి నేటి వరకూ అప్రహిత విజయాలను సాధిస్తూ వస్తోంది. 


అనంతపురంలో సైకిల్ జోరేనా...

పెనుకొండ నియోజకవర్గంలో రొద్దం, సోమందేవ్ పల్లె, గోరంట్ల, పరిగి, పెనుకొండ మండలాలున్నాయిి. ఇందులోని అన్ని మండలాల్లో టీడీపీకి బాగా పట్టుంది. గత ఎన్నికల్లో ఇక్కడి నుంచి పోటీ చేసిన బీకే పార్థసారధి, తన సమీప ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి శంకరనారాయణపై దాదాపు 17 వేల ఓట్ల తేడాతో విజయం సాధించారు.తిరిగి మరలా ఆ ఇద్దరే ఈసారి బరిలో ఉన్నారు. అయితే ఈసారి తెలుగుదేశం పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేపై కొంత వ్యతిరేక కన్పిస్తోంది. హిందూపురం పార్లమెంటు సభ్యుడు నిమ్మల కిష్టప్పకు, బీకే పార్థసారధికి పొసగడం లేదు. గత కొన్నేళ్లుగా ఇద్దరి మధ్యవైరంమూలంగా అభివృద్ది పనులు నిలిచిపోయాయి. ఎంపీ ల్యాడ్స్ కింద విడుదల చేసిన నిధులతో ప్రారంభించాల్సిన పనులు కూడా నిలిచిపోయాయి. ఎంపీ, ఎమ్మెల్యేల మధ్య వార్ బహిరంగం కావడంతో ఇద్దరూ ఒకరినొకరు ఓడించుకోవడానికే ఎక్కువగా కృషి చేశారన్నది పార్టీలో విన్పిస్తున్న టాక్. ఎంపీ, ఎమ్మెల్యేల వర్గాలు క్రాస్ ఓటింగ్ కూ పాల్పడ్డారన్న వార్తలు వస్తున్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యే బీకే పార్థసారధి మాత్రం బిందాస్ గా ఉన్నారు. గెలుపు పై ఫుల్లు ధీమాతో ఉన్నారు. అంతర్జాతీయ కార్ల పరిశ్రమ కియా పెనుకొండకు రావడంతో ఇక్కడ టీడీపీకి ప్లస్ పాయింట్ అయిదంటున్నారు. కియా రాకతో పెనుకొండ ప్రాంతంలో రూపురేఖలే మారిపోయాయంటున్నారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభించడంతో సైకిల్ పార్టీవైపే మొగ్గు చూపారంటున్నారు. మరోవైపు అభివృద్ధితో పాటు సంక్షేమపథకాలను చూసి టీడీపీ వైపు మొగ్గు చూపారని బీకే అంటున్నారు. వైసీపీ అభ్యర్థి శంకరనారాయణ సయితం గెలుపు పై ధీమాగా ఉన్నప్పటికీ కియా ఇక్కడ సైకిల్ ను పరుగులు తీస్తుందన్నది విశ్లేషకుల అంచనా. ఇక్కడ పోటీ చేసిన జనసేన, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు నామమాత్రమే.

No comments:
Write comments