ఓటు హక్కు వినియోగించుకున్న ప్రధాని మోదీ

 

అహ్మదాబాద్,ఏప్రిల్ 23 (globelmedianews.com)
మూడవ విడత జరుగుతున్న ఎన్నికల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అహ్మదాబాద్లో జరుగుతున్న పోలింగ్లో ఆయన ఓటు హక్కును వినియోగించుకున్నారు.  రనిప్ పోలింగ్ కేంద్రంలో ఆయన ఓటు వేశారు. 


ఓటు హక్కు వినియోగించుకున్న ప్రధాని మోదీ

అంతకుముందు అయన తన తల్లి హీరా బెన్ కు నమస్కరించి ఆశిస్సులు పోందారు. ప్రధాని పోలింగ్ బూత్ కు రానుండంతో  పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.   ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. పవిత్రమైన ఓటు హక్కు వినియోగించుకోవడం సంతోషంగా ఉందన్నారు.  అందరూ తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు.  కుంభమేళాలో పాల్గొన్నంత ఆనందం కలుగుతుందని ప్రధాని అన్నారు. 

No comments:
Write comments