న్యాయ్ పథకం..పేదరికం పై సర్జికల్ స్ట్రైక్

 

ఏఐసిసి అధికార ప్రతినిధి ఫ్రొఫెసర్ రాజీవ్ గౌడ
హైదరాబాద్, ఏప్రిల్ 4 (globelmedianews.com
న్యాయ్ పథకం..పేదరికం పై సర్జికల్ స్ట్రైక్ అని ఏఐసిసి అధికార ప్రతినిధి ఫ్రొఫెసర్ రాజీవ్ గౌడ అన్నారు. ప్రతి పేదకుటుంబానికి ఏడాదికి 72000 అందిస్తాం ..అది నేరుగా లబ్ధిదారుని బ్యాంక్ అకౌంట్ లోకి వెళ్తున్దన్నారు. రైతుల కస్టాలు తీర్చేందుకే వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్ ను కేయించతున్నట్లు తెలిపారు.దేశ వ్యాప్తంగా మేధావులు ,ప్రజల అభిప్రాయాలతో కాంగ్రెస్ మ్యానిఫెస్టో రూపొందించమన్నారు.గురువారం గాంధీ భవన్ లో మీడియా సమావేశం లో మాట్లాడుతూరాబోయే కాంగ్రెస్ ప్రభుత్వానికి బ్లుప్రింట్ ..ఈ మ్యానిఫెస్టో అన్నారు.వ్యవసాయ రంగ అభివృద్దే కాంగ్రెస్ లక్ష్యమన్నారు.న్యాయ్ పథకం..పేదరికం పై సర్జికల్ స్ట్రైక్ 

యువతకు ఉద్యోగ కల్పించడంలో మోడీ పూర్తిగా వైఫల్యం చెందారని విమర్శించారు.మోడీ పాలనలో ..భారత్ జాబ్ లెస్ దేశంగా మారిందని ఎద్దేవా చేసారు.ఉపాధిని పెంచి ..నిరుద్యోగ నిర్ములనకు కాంగ్రెస్ ప్రామిస్ చేస్తుందని చెప్పారు.ఇండియన్ రైల్వే ను ఆధునీకరిస్తామన్నారు.ప్రజలకు ఇబ్బంది లేకుండా జిఎస్టీని సవరిస్తామన్నారు.మహిళలపై దాడులను అరికట్టేందుకు ప్రత్యేక వ్యవస్థను రుపొందిస్తామన్నారు.ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ ను పటిష్టంగా అమలు చేస్తామని,గిరిజనులకు అండగా ఉంటామన్నారు.దేశంలో పేదరికం లేకుండా చేయడమే న్యాయ్ లక్ష్యమన్నారు.పారిశ్రామిక రంగానికి సరళ జీఎస్టీ ని అమలుచేసి ..రంగాన్ని అభివృద్ధి చేస్తామన్నారు.ప్రయివేట్  ఆసుపత్రి లో రోగనిర్థారణ పరీక్షలు ,మందులు కూడ ఉచితంగా అందిస్తామన్నారు.ఆరోగ్య సంరక్షనకు జీడీపీలో మూడు శాతం నిధులు ఖర్చుచేస్తామని రాజీవ్ గౌడ వెల్లడించారు.

No comments:
Write comments