రేషన్ లిస్ట్ నుంచి కిరోసిన్ ఔట్

 

నల్లగొండ, ఏప్రిల్ 30, (globelmedianews.com)
పౌర సరఫరా శాఖ ప్రజా పంపిణీ వ్యవస్థ పేదలకు నిత్యావసర వస్తువులను సరసమైన ధర లకు అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా పనిచేస్తోంది. బియ్యం, కిరోసిన్‌, గోధుమలు, పంచదార తదితర వస్తువులను అందిస్తోంది. హైద రాబాద్‌ జిల్లాలో 9 సర్కిళ్ల పరిధిలో సుమారు 670 రేషన్‌ షాపులు ఉన్నాయి. వీటిలో 5.84 లక్షల ఆహార భద్రత కార్డుల ద్వారా బియ్యం, కిరోసిన్‌లను వినియోగదారులు పొందుతున్నారు. గతంలో తెలుపు, గులాబీ కార్డులు వేర్వేరుగా ఉండగా, ప్రస్తుతం గులాబీ కార్డులను తొలగించి, తెలుపు కార్డులు కలిగిన కుటుంబాలు మాత్రమే సబ్సిడీ వస్తువులను పొందుతున్నారు. జిల్లాలో 5,52,202 ఆహార భద్రత కార్డులు, 30,598 అంత్యోదయ ఆహార భద్రత కార్డులు, 1428 అన్నపూర్ణ కార్డులున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో చౌక ధరల దుకాణాల ద్వారా రూ.185లకే 14 రకాల వస్తు వులను పంపిణీ చేయగా, ప్రస్తుతం బియ్యం, కిరోసిన్‌లకు మాత్రమే పరిమితమైంది. ఆహార భద్రత కార్డుదారులకు బియ్యం, కిరోసిన్‌ అందిస్తుం డగా, అంత్యోదయ కార్డులకు 35 కిలోల బియ్యం, అన్నపూర్ణ కార్డుదారులకు 10 కేజీల బియ్యం ఉచితంగా అందుతుండగా, కిరోసిన్‌ 1 లీటర్‌, 2 కిలోల గోదుమలు సైతం సరఫరా చేస్తారు. రేషన్ లిస్ట్ నుంచి కిరోసిన్ ఔట్

రాష్ట్ర వ్యాప్తంగా పౌర సరఫరాల శాఖలో సరఫరా అవుతున్న బియ్యం, కిరోసిన్‌ తదితర వస్తువులను కేంద్ర ప్రభుత్వం సబ్సిడీపై అందిస్తోంది. బియ్యంలో 75 శాతం కేంద్రం భరిస్తుండగా, రాష్ట్ర ప్రభుత్వం 25 శాతం భరిస్తోంది. అలాగే కిరోసిన్‌ పూర్తి సబ్సిడీని కేంద్ర ప్రభుత్వం భరిస్తోంది. చౌక ధరల దుకాణంలో మొదట కిరోసిన్‌ ధర రూ.2లు మాత్రమే ఉండగా, ప్రస్తుతం రూ.30లకు అందిస్తున్నారు. మే నెల నుంచి కిరోసిన్‌ ధర రూ.30 నుంచి రూ.32 లకు పెంచుతున్నట్టు సివిల్‌ సప్లరు కమీషనర్‌ ప్రత్యేక ఉత్తర్వ్యులు జారీ చేశారు. దీంతో వచ్చే నెల నుంచి కిరోసిన్‌ రూ.32లకు విక్రయించనున్నారు. హైదరాబాద్‌ జిల్లా వ్యాప్తంగా ఏప్రిల్‌లో 4.50 లక్షల లీటర్ల కిరోసిన్‌ను వినియోగదారులు కొనుగోలు చేసినట్టు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. కిరోసిన్‌ ధర జూన్‌ మాసంలో రూ.35లకు పెరిగే వీలుందని పలువురు అంటున్నారు. ఈ క్రమంలోనే జులై లేదా ఆగష్టు నెలల్లో పూర్తి స్థాయిలో కిరోసిన్‌ను చౌక ధరల దుకాణాల నుంఇ తొలగించనున్నట్టు సమాచారం. కిరోసిన్‌ ద్వారానే హైదరాబాద్‌ జిల్లాలో ప్రతినెలా కేంద్రానికి రూ.17 కోట్లు సబ్సిడీ భారం తగ్గనుండగా, రాష్ట్ర వ్యాప్తంగా సుమారు రూ.26.29 కోట్లు సబ్సిడీ భారాన్ని కేంద్రం తప్పించుకోనుంది. రాష్ట్రంలో కిరోసిన్‌ సబ్సిడీని పూర్తిగా ఎత్తివేయడాన్ని రాష్ట్ర ప్రభుత్వం పరోక్షంగా అంగీకరించినట్టుగా తెలుస్తోంది. కిరోసిన్‌కు ప్రత్యామ్నాయంగా అదనపు గ్యాస్‌ను అడగాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్టు పలువురు చెబుతున్నారు. అయితే, అత్యధిక శాతం కిరోసిన్‌ వినియోగించేది అత్యంత పేదలు, పేద, మధ్య తరగతి వర్గాలు మాత్రమే. పేదల ఇండ్లల్లో ఇప్పటికీ చాలామంది కిరోసిన్‌ను ఎక్కువ శాతమే వినియోగిస్తున్నారు. అయితే, కేంద్రం భరిస్తున్న ఈ సబ్సిడీ నుంచి పూర్తిగా వైదొలగడం వల్ల కేంద్రానికి భారీ స్థాయిలోనే నిధులు మిగులనున్నాయి. కేంద్ర ప్రభుత్వంలో మెప్పు పొందడం కోసమే ఈ ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించినట్టు పలువురు యూనియన్‌ నాయకులు చెబుతున్నారు.

No comments:
Write comments