వాళ్లకు ఓటేస్తే మోరిలో వేసినట్లే

 

గజ్వేల్, ఏప్రిల్ 8 (globelmedianews.com)
సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో మాజీ మంత్రి హరీష్ రావు, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి సమక్షంలో కొండపాక మండలానికి చెందిన వివిధ పార్టీల సర్పంచులు, వార్డ్ మెంబర్లు, వంద మంది కార్యకర్తలు తెరాసలో చేరారు. ఈ సందర్బంగా హరీష్ మాట్లాడుతూ  లక్ష యాబై వేల ఎకరాలకు సాగునీరు అందబోతుంది.  మీరు ఒక మూడు రోజులు కష్ట పడండి మిమ్మల్ని 5 సంవత్సరాలు కాపాడుకుంటాం.  


వాళ్లకు ఓటేస్తే మోరిలో వేసినట్లే

రాబోయే రోజుల్లో గజ్వేల్ అభివృద్ధి డబుల్ అవుతుంది.  ఈ దేశంలో లక్ష యాబై వేల మెజారిటీతో కొత్త ప్రభాకర్ రెడ్డి గెలుపొంది ,దేశంలోనే నంబర్ వన్ ఎంపీ గా  కొత్త ప్రభాకర్ రెడ్డి చరిత్ర పుటలో నిలవబోతున్నాడని అన్నారు. డిపాజిట్ రాని కాంగ్రెస్, బిజెపి పార్టీకి ఓటువేస్తే మోరిలో వేసినట్లే నని అయన వ్యాఖ్యానించారు.

No comments:
Write comments