రైస్ మిల్లింగ్ కష్టాలు

 

నిజామాబాద్, ఏప్రిల్ 4, (globelmedianews.com)
సీఎంఆర్ కోసం ప్రభుత్వం తమ రైస్‌మిల్లుకు కేటాయించిన ధాన్యం కంటే అదనంగా తీసుకెళ్లిన రైస్‌మిల్లర్లకు సహకరించిన ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహకులపై కూడా వేటు పడింది. ప్రభుత్వ అనుమతి లేకుండా రైస్‌మిల్లర్లకు ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహకులు అదనంగా ధా న్యం ఇవ్వటాన్ని జిల్లా కలెక్టర్ దుగ్యాల అమయ్‌కుమార్ తీవ్రం గా పరిగణించారు. ఈ నేపథ్యంలో రైస్‌మిల్లర్లకు ఎక్స్‌ట్రా ధా న్యం ఇచ్చిన 56 కొనుగోలు కేంద్రాల నిర్వహకులకు కమీషన్ చార్జీలు చెల్లించవద్దని ఆయన పౌర సరఫరాల సంస్థ అధికారులను ఆదేశించారు. దీంతో 56 ధాన్యం కొనుగోలు కేంద్రాలకు అదనపు ధా న్యం కమీషన్ చార్జీలు సుమారు రూ.23 లక్షల నిలిపివేతకు పౌర సరఫరాల సంస్థ అధికారులు నిర్ణయించారు. రైతులకు మ ద్దతు ధర లభించాలనే ఉద్ధేశంతో ప్రతీ సంవత్సరం ప్రభుత్వం పౌర సరఫరాల సంస్థ ద్వారా ధాన్యం కొనుగోలు చేస్తుంది. రైతులకు అందుబాటులో ధాన్యం కొనుగోలు కేంద్రాలు నిర్వహిస్తుం ది. ఈ కేంద్రాల్లో మద్దతు ధర చెల్లించి రైతుల నుంచి నేరుగా ధాన్యం కొని సీఎంఆర్ కోసం రైస్‌మిల్లర్లకు కేటాయిస్తుంది. ప్రతీ సంవత్సరం వానాకాలం, యాసంగిలో ధాన్యం కొనుగోలు ప్రా రంభానికి ముందే పౌరసరఫరాల శాఖ అధికారులు ప్రభుత్వ నిబంధనల ప్రకారం రైస్‌మిల్లులకు సీఎంఆర్ కోసం ధాన్యం కేటాయింపులు జరుపుతున్నారు. 


రైస్ మిల్లింగ్ కష్టాలు

ఆయా రైస్‌మిల్లు కెపాసిటీని బట్టి ఈ కేటాయింపులు చేస్తున్నారు. ధాన్యం కేటాయింపుల జాబితాను కొనుగోలు కేంద్రాల నిర్వహకులకు అందజేస్తున్నారు. ఈ కేటాయింపుల జాబితా ప్రకారం రైస్‌మిల్లులకు ట్యాగింగ్ చేస్తున్నారు. లెక్కన ఆయా రైస్‌మిల్లుకు పౌరసరఫరాల శాఖ అధికారులు సీఎంఆర్ కోసం ఎన్ని టన్నుల ధాన్యం కేటాయింపులు జరిపారు అనే సమాచారం కొనుగోలు కేంద్రాల నిర్వహకులు వినియోగించే ట్యాబ్‌లో స్పష్టంగా ఉంటుంది. ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహకులకు తాము అందజేసిన ట్యాబ్‌ల్లో పొందుపర్చిన కేటాయింపులకు అనుగుణంగా పౌరసరఫరాల శాఖ అధికారులు రైస్‌మిల్లర్లకు రిలీజ్ ఆర్డర్(ఆర్‌ఓ) ఇస్తారు. ఆర్‌ఓను తమకు అందజేసిన రైస్‌మిల్లర్లకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం కొనుగోలు కేంద్రాల నిర్వహకులు ధాన్యం ఇవ్వాల్సి ఉంది. సివిల్ సప్లయ్ అధికారులు తమకు సరఫరా చేసిన ట్యాబ్‌లో పొందుపర్చిన కేటాయింపుల కంటే అదనంగా ఎట్టిపరిస్థితుల్లోనూ కొనుగోలు కేంద్రాల నుంచి రైస్‌మిల్లర్లకు ఇవ్వకూడదు. రైస్‌మిల్లర్లు కూడా పౌరసరఫరాల శాఖ అధికారులు తమకు కేటాయించిన ధాన్యం నిల్వలను మాత్రమే కొనుగోలు కేంద్రాల నుంచి సీఎంఆర్ కోసం తీసుకెళ్లాలి. గత వానాకాలం సీజన్‌లో రైస్‌మిల్లర్లు, కొన్ని ధాన్యం కేంద్రాల నిర్వహకులు ఒక అవగాహనకు వచ్చి ప్రభుత్వ నిబంధనలకు పాతరేశారు. రైస్‌మిల్లర్లు తమకు పౌరసరఫరాల శాఖ కేటాయించిన ధాన్యం కంటే అదనపు నిల్వలను కొనుగోలు కేంద్రాల నుంచి తీసుకెళ్లారు. సుమారు 72వేల క్వింటాళ్ల ధాన్యాన్ని తమ రైస్‌మిల్లులకు అదనంగా తరలించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహకులు ఎలాంటి అభ్యంతరం చెప్పలేదు. తమ కొనుగోలు కేంద్రాల నుంచి కేటాయింపుల కంటే అదనంగా ధాన్యం తీసుకెళ్లిన రైస్‌మిల్లర్లకు సహకరించారు. రిలీజ్ ఆర్డర్ లేకుండా ట్యాగింగ్ చేసిన కేటాయింపుల కంటే అదనంగా రైస్‌మిల్లర్లకు కొనుగోలు కేంద్రాల నిర్వహకులు ధా న్యం ఇవ్వటానికి, రైస్‌మిల్లర్లు తమకు పౌరసరఫరాల శాఖ కేటాయించిన ధాన్యం కంటే ఎక్కువగా తీసుకెళ్లటానికి సంబంధిత అధికారులు కూడా బాధ్యులే. ట్యాగింగ్ చేసిన ప్రకారమే కొనుగోలు కేంద్రాల నుంచి రైస్‌మిల్లులకు ధాన్యం తరలివెళ్లేలా, పౌరసరఫరాల శాఖ జారీ చేసే రిలీజ్ ఆర్డర్ ప్రకారమే కొనుగోలు కేంద్రాల నిర్వహకులు రైస్‌మిల్లర్లకు ధాన్యం ఇచ్చేలా సంబంధిత అధికారులు పర్యవేక్షించాల్సి ఉంది. ఆయా కొనుగోలు కేం ద్రంలో రైతుల నుంచి కొన్న ధాన్యం ఎంత..? ఇందులో ఆయా రైస్‌మిల్లుకు ఎంత తరలిపోయింది..? కేటాయింపుల ప్రకారమే ధాన్యం రైస్‌మిల్లులకు తరలిపోతుందా..? ట్యాగింగ్‌కు అనుగుణంగానే కొనుగోలు కేంద్రాల నిర్వహకులు రైస్‌మిల్లర్లకు ధాన్యం ఇస్తున్నరా అనేది ఎప్పటికప్పుడు సంబంధిత అధికారులు పరిశీలించాల్సి ఉంది. కొనుగోలు కేంద్రాల నిర్వహకులు, రైస్‌మిల్లర్లు గానీ నిబంధనలు అతిక్రమించినట్లు తమ దృష్టికి వస్తే వెంటనే చర్యలు చేపట్టాలి. ప్రధానంగా కొనుగోలు కేంద్రాల వద్ద పర్యవేక్షకులతో పాటు పౌరసరఫరాల శాఖ అధికారుల నిఘా ఉండాలి. కొన్ని కొనుగోలు కేంద్రాల నుంచి కేటాయింపుల కంటే అదనంగా వేలాది క్వింటాళ్ల ధాన్యం రైస్‌మిల్లర్లకు తరలిపోయినప్పటికీ పర్యవేక్షకులు, పౌరసరఫరాల శాఖ అధికారులు గానీ స్పందించలేదు. అక్రమాలు జరుగుతున్నాయని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురాలేదు. కొద్ది రోజుల క్రితం కొనుగోలు కేంద్రాల నిర్వహకులు, రైస్‌మిల్లర్ల అదనపు వ్యవహారం తన చెవిన పడటంతో జిల్లా కలెక్టర్ అమయ్‌కుమార్ అక్రమార్కులపై వేటు వేసే దిశలో అడుగులు వేస్తున్నారు. ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించిన రైస్‌మిల్లర్లకు మిల్లింగ్ చార్జీలు, ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహకులకు కమీషన్ చెల్లించొద్దని ఇప్పటికే ఆయన నిర్ణయం తీసుకున్నారు. తద్వారా ప్రభుత్వానికి సుమారు రూ.46లక్షల ఆదాయం సమకూరింది. ఈ నేపథ్యంలో కేటాయింపుల కంటే రైస్‌మిల్లర్లు అదనపు ధా న్యం తీసుకెళ్లటం, వీరికి కొనుగోలు కేంద్రాల నిర్వహకులు సహకరించిన వ్యవహారంలో బాధ్యులైన అధికారులపై కూడా వేటు పడేనా..? అనే అంశంపై వివిధ ప్రభుత్వ శాఖల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది. పౌరసరఫరాల శాఖలోని కొందరు అధికారులు అధనం వ్యవహారంలో రైస్‌మిల్లర్లు, కొనుగోలు కేం ద్రాల నిర్వహకులకు తమవంతు సాయం చేసినట్లు తెలుస్తోంది.

No comments:
Write comments