మైనారిటీ సంక్షేమం కాంగ్రెస్ తోనే సాధ్యం

 

ముస్లిం మైనారిటీలతో ఆత్మీయ సమ్మేళనం
హజరైన గద్దర్ , ఎంపీ అభ్యర్థి మధుయాష్కీ గౌడ్
జగిత్యాల  ఏప్రిల్ 9(globelmediaenws.com)
మైనారిటీ సంక్షేమం కాంగ్రెస్ పార్టీ తోనే సాధ్యమని కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ టి.జీవన్ రెడ్డి ఆన్నారు. సోమవారం రాత్రి జగిత్యాల పట్టణంలోని రూబి ఫంక్షన్ ఫ్యాలేస్ లో మైనారిటీలతో ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈకార్యక్రమం ముఖ్య అతిధిగా ప్రజాగాయకుడు గద్దర్ ,నిజామాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి మధు యాష్కి గౌడ్ ,ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి హజరై ఈసందర్భంగా గద్దర్ తన ఆట ,పాటలతో టీఆర్ఎస్ ,బీజేపీ పరిపాలన ,ప్రజావ్యతిరేకత విధానంపై చేపట్టిన నాటిక మైనారిటీ లకు ఆకట్టుకున్నాయి .ఆనంతరం ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ పార్టీ ఆడ్డుకునే ధైర్యం ,బలం కేవలం కాంగ్రెస్ పార్టీ తప్ప వేరే పార్టీ కిలేదన్నారు.రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయ కేతనం ఏగరవేస్తామన్నారు.రాహాల్ గాంధీ ప్రధాని ఆవడం కయం ఆన్నారు.12శాతం మైనారిటీ రిజర్వేషన్లు కాంగ్రెస్ పార్టీ తోనే సాధ్యం ఆన్నారు. 


మైనారిటీ సంక్షేమం కాంగ్రెస్ తోనే సాధ్యం 

కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగనే ట్రిపుల్ తలాక్ బిల్లును రద్దు చేస్తామన్నారు. ఆనంతరం మధుయాష్కీ గౌడ్ మాట్లాడుతూ నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో కల్వకుంట్ల కవిత ఓటమి ఖాయమైందని ,తండ్రి కూతురు ఓడిపోతుందనే భయంతో కేసీఆర్ ఏకంగా ఎమ్మెల్యే మండవ వెంకటేశ్వరరావు ఇంటికి వెళ్లి మంతనాలు జరిపి ,పార్టీ లో చేర్చుకున్నారని ఆరోపించారు. ఐదు సంవత్సరాలు ఎంపీ గా ఉండి ఎన్నాడు అభివృద్ధి ,సంక్షేమ పై దృష్టి సారించలేదన్నారు.కేవలం బతుకమ్మ పండుగ పేరుతో కోట్లాది రూపాయల ప్రజా ధనాన్ని దుబారా ఖర్చు పెట్టి దోచుకుందని ఆరోపించారు.పసుపు బోర్డు ఏర్పాటు, చెక్కెర ఫ్యాక్టరీని తెరిపిస్తానని కవిత ఇచ్చిన హామీ ఏమయ్యాయని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రం కోసం పార్లమెంటు లో ఉద్యమం చేశామని గుర్తుచేశారు. కాంగ్రెస్ పార్టీ పేదల సంక్షేమం కోసం ఏల్లప్పుడు పాటుపడుతుందన్నారు.ఈకార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ టి.విజయలక్ష్మీ ,మున్సిపల్ వైస్ చైర్మన్ సిరాజోద్దీన్ మన్సూర్ ,గిరి నాగభూషణం ,బండ శంకర్, కౌన్సిలర్ గాజుల రాజేందర్ ,కొత్త మోహన్, కాశీనాదం, ఆశోక్, మీర్ ఖాజీమ్ అలీ ,అజర్ ,మునీరోద్దిన్ ,మున్నా ,యూసఫ్ ఆజాద్ ,కమాల్ ,జుల్ఫేకర్ తదితరులు పాల్గొన్నారు.

No comments:
Write comments