డిచ్ పల్లిలో తెరాస అవిర్భావ దినోత్సవం

 

నిజామాబాద్, ఏప్రిల్ 27, (globelmedianews.com)
నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావ దినోత్సవాన్ని పార్టీ శ్రేణులుజరుపుకున్నారు. ముందుగా  తల్లి తెలంగాణ విగ్రహం కు పూల మాల వేసి పార్టీ జెండాను ఆవిష్కరించారు.   ఈ సందర్భంగా డిచ్పల్లి మండల తెరాస.పార్టీ అధ్యక్షుడు శక్కరికొండ కృష్ణ  మాట్లాడుతూ  2001 ఏప్రిల్ 20వ తేదీన సీఎం కేసీఆర్ సారథ్యంతో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని ఏర్పాటు చేసి మలిదశ ఉద్యమం శాంతియుతంగా చేపట్టారని అన్నారు. 


డిచ్ పల్లిలో తెరాస అవిర్భావ దినోత్సవం

సకల జనుల సమ్మె ద్వారా ఉద్యోగ ఉపాధ్యాయుల అన్ని వర్గాల ప్రజలతో కలిసి ఉద్యమించడంతో 2013లో కేంద్రం తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించి దన్నారు.  పోరాడి సాధించుకున్న రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో సీఎం కేసీఆర్ అభివృద్ధి పరుస్తున్నారని అన్నారు. ప్రాజెక్టుల నిర్మాణం,  కళ్యాణలక్ష్మీ,  షాదీముబారక్ వంటి అనేక సంక్షేమ పథకాలకు కృషి చేసిన టిఆర్ఎస్ పార్టీని ప్రజలు విశ్వసిస్తున్నారని తెలిపారు.  ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని అభివృద్ధి దశలో ముందుకు తీసుకు వెళ్తున్నారని వారు తెలిపారు . అన్ని వర్గాలకు సమానం గా చూడడమే ఆయన లక్ష్యమన్నారు . ఈ కార్యక్రమంలో అంజన్న, కులాచారి శాంరావు,  కార్యకర్తలు పాల్గొన్నారు .

No comments:
Write comments