రాష్ట్ర అభివృద్ధి కోసం పునరంకితం అవుదాం

 

మాజీ మంత్రి , ఎమ్మెల్యే హరీష్ రావు 
సిద్దిపేట, ఏప్రిల్ 27, (globelmedianews.com)
సిద్దిపేట లో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు  తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొని జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ  తెరాస పార్టీ 18 ఏళ్లు పూర్తి చేసుకొని 19 వ యేడాదిలో అడుగుపెడుతున్న సందర్భంగా సీఎం కేసీఆర్ కు, తెరాస నాయకులకు, కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలియజేశారు. 2001 ఏప్రిల్ 27 జలదృశ్యం లో ప్రారంభం అయిన ఈ ఉద్యమం ఈ రోజు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి పరిపాలనలో కూడా దేశానికే ఆదర్శంగ నిలవడం గర్వకారణం అని అన్నారు. 


రాష్ట్ర అభివృద్ధి కోసం పునరంకితం అవుదాం

ఏప్రిల్ 27 చరిత్రలో లిఖించదగిన రోజన్నారు. అదే స్ఫూర్తితో  తెలంగాణ అభివృద్ధిలో  ప్రతి ఒక్కరు బాగాస్వామ్యం కావాలని మరొక సారి ప్రజల ఆకాంక్షను నెరవేర్చే దిశగా  కార్యకర్తలు పునరంకితం కావాలన్నారు. ఈ రోజు ఉద్యమం చేసి ర్రాష్టాన్ని సాధించమంటే ఎందరో కార్యకర్తల కష్టం శ్రమ ఉన్నది.  ప్రతి కార్యకర్తకు హృదయ పూర్వకంగా శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నానని అన్నారు.  రానున్న రోజుల్లో రాష్ట్ర అభివృద్ధి,  మరో వైపు ప్రతి కార్యకర్త సంక్షేమం కోసం పార్టీ కృషి చేస్తోంది. కేసీఆర్ నాయకత్వం లో ఈ రాష్టం అభివృద్ధిలో ముందు కెళ్లడం సంతోషకరమని అన్నారు.  ఏ ఆకాంక్ష ల కోసం తెలంగాణ సాదించామో అ దిశలో కేసీఆర్ నాయకత్వం లో ముందుకెళ్లి పుంరకింతం కావాలని అన్నారు. 

No comments:
Write comments