ప్రాంతీయ పార్టీలదే హవానా....

 

న్యూఢిల్లీ, ఏప్రిల్ 30 (globelmedianews.com
దేశంలో మూడు ఎన్నిక‌లకు ముందు ప్రాంతీయ పార్టీలంటే పెద్ద‌గా ప‌ట్టించుకున్న ప‌రిస్తితి లేదు. కానీ, రానురాను ప్రాం తీయ పార్టీల దూకుడు పెరిగింది. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీల బ‌లం పెరుగుతూ వ‌చ్చింది. దీంతో జాతీ య పార్టీలైన కాంగ్రెస్‌, బీజేపీల ప‌రిస్థితి నానాటికీ తీసిక‌ట్టుగా మారుతోంది. ఈ క్ర‌మంలో ఒక్క ఆయా రాష్ట్రాల్లోనే కాకుండా జాతీయ స్థాయిలోనూ ప్రాంతీయ పార్టీలు చ‌క్రం తిప్పుతున్నాయి. తాజాగా జ‌రిగిన ఎన్నిక‌ల్లోనూ ప్రాంతీయ పార్టీల‌దే హ‌వా ఎక్కువ‌గా క‌నిపించింది. త‌మిళ‌నాడు, ఒడిసా, క‌ర్ణాట‌క‌, తెలంగాణ‌, ఏపీల్లో ఎన్నిక‌లు దాదాపు ముగిశాయి. ఆయా రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు త‌మ స‌త్తా చాటుకున్నాయి.ఏపీ, తెలంగాణాల్లో ప్రస్తుత సమీకరణాలు చూస్తే కేసీఆర్, జగన్ మోహన్ రెడ్డిల పార్టీలు రెండు కలిపి 30 స్థానా లు దక్కించుకునే అవకాశం ఉంది. ఒడిసాలో మొత్తం 21లోక్‌సభ స్థానాలకు గాను నవీన్ పట్నాయక్ పార్టీకి ఎంత లేదన్నా 14 నుంచి 15 స్థానాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రాంతీయ పార్టీలదే హవానా....

ఇక మిగతా రెండు కీలక రాష్ట్రాలను పరిశీలిస్తే బెంగాల్‌లో తృణమూల్ పార్టీకి బీజేపీ నుంచి పెద్దగా నష్టం ఉండకపోవచ్చు. ఇక్క‌డ మొత్తం 42 సీట్లకు గాను మమతా బెనర్జీ పార్టీ తృణమూల్ కాంగ్రెస్‌కు 35కు పైగా సీట్లు వచ్చే అవకాశాలున్నాయి. ఇక ఉత్తర్‌ప్రదేశ్ సమీకరణాలు పరిశీలిస్తే అఖిలేష్ యాదవ్ – మమతా కాంబినేషన్‌కు కనీసం 40 స్థానాలు లేదా అంతకంటే ఎక్కువే దక్కే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి.అదేవిధంగా త‌మిళ‌నాడులోనూ అన్నాడీఎంకే, డీఎంకే పార్టీలు కూడా పుంజుకున్నాయి. అమ్మ సెంటిమెంట్‌తో పాటు క‌రుణానిధి సెంటిమెంట్ కూడా అక్క‌డ తోడైంది. దీంతో అక్క‌డి ఎంపీ సీట్ల‌లో ఓ నాలుగు మిన‌హా మిగిలిన సీట్ల‌లో ఈ రెండు పార్టీలూ హ‌వా ప్ర‌ద‌ర్శించ‌నున్నాయి. దీంతో కేంద్రంలో నేరుగా అధికారంలోకి వ‌చ్చే అవ‌కాశం బీజేపీకి కానీ, కాంగ్రె స్‌కు కానీ క‌నిపించ‌డం లేదు. దీంతో ప్రాంతీయ పార్టీల‌పైనే ఈ రెండు ఆధార‌ప‌డి నెట్టుకువ‌చ్చే అవ‌కాశం క‌నిపిస్తోంద‌ని అంటున్నాయి. స‌హ‌జంగానే ప్రాంతీయ పార్టీలు బ‌లప‌డితే.. ఆయా రాష్ట్రాల స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించే పార్టీల‌కే కేంద్రంలో మ‌ద్ద‌తిచ్చేందుకు రెడీ అవుతాయి.ఇప్ప‌టికే ఏపీకి సంబంధించిన ప్ర‌త్యేక హోదా, పోల‌వ‌రం వంటి ప్రాజెక్టుల‌ను దృష్టిలో పెట్టుకున్న జ‌గ‌న్‌.. వీటికి మ‌ద్ద‌తిచ్చే వారికే త‌న మ‌ద్ద‌తు ఉంటుంద‌ని చెప్పారు. అదేవిధంగా కేసీఆర్ కూడా ఈ త‌ర‌హా ప్రక‌ట‌నే చేశారు. ఒడిసా, ప‌శ్చిమ‌బెంగాల్‌, త‌మిళ‌నాడు రాష్ట్రాల ప‌రిస్తితి కూడా ఇదే త‌ర‌హాలో ఉండ‌నుంది. దీంతో ప్రాంతీయ పార్టీలు పైచేయి సాధించ‌డం త‌థ్య‌మ‌నే మాట వినిపిస్తోంది. రేప‌టి ఎన్నిక‌ల ఫ‌లితాల త‌ర్వాత కేంద్రంలో ప్రాంతీయ పార్టీలే నిర్ణ‌యాత్మ‌క శ‌క్తులుగా మార‌తాయ‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు.

No comments:
Write comments