కేసీఆర్ ఒక రాజకీయ ఉన్మాది

 

పార్టీలు మారిన ఎమ్మెల్యేలంతా మోసగాళ్లే
 ఏమి ఆశించి రేగా కాంతారావు టీఆర్ఎస్ లో చేరారు
 పోడు భూములు లాక్కున్న పార్టీలోకి గిరిజనుడైన కాంతారావు ఏ కారణం చేత వెళ్లారో ప్రజలకు చెప్పాలి
 పార్టీ మారిన ఎమ్మెల్యేలపై ప్రజలు 420 కేసులు పెట్టాలని పిలుపునిచ్చిన సీఎల్పీ నేత భట్టి విక్రమార్క
అళ్లపల్లి, ఏప్రిల్ 30 (globelmedianews.com)
ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక రాజకీయ ఉన్మాదిలా ప్రవర్తిస్తున్నారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. భట్టి విక్రమార్క చేపట్టిన  ప్రజాపరిరక్షణ పినపాక నియోజకవర్గం ఆళ్లపల్లి చేరిన సనదర్భంగా ఆయన ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. భట్టి విక్రమార్కతో పాటు భద్రాచలం ఎమ్మెల్యే పొడెం వీరయ్య, మాజీ ఎమ్మెల్యే చందా లింగయ్య పాల్గొన్నారు.  గ్రామాల్లో ఎవరైనా ఒక మాట ఇచ్చి తప్పితే అతన్ని మోసగాడు అని అంటాం.. అలాంటిది 73 వేల మంది ప్రజలకు ఇచ్చిన మాట మరిచి.. వాళ్ళు ఓట్లు వేసి గెలిపించగానే.. ప్రజలకు మోసం చేసి పార్టీ మారారని అయన అన్నారు.  ప్రజాస్వామ్యానికి దేవాలయం వంటి శాసనసభలో ఇటువంటి మోసగాళ్ళు ఉండకూడదని ఆయన అన్నారు. 


 కేసీఆర్ ఒక రాజకీయ ఉన్మాది

ఏమి ఆశించి వెళ్లారో చెప్పాలి
పార్టీ మారిన పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు ఏమి ఆశించి వెళ్లారో ప్రజలకు చెప్పాలని అన్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ పోడు భూములపై గిరిజనులకు హక్కులు కల్పిస్తే.. టీఆర్ఎస్ దానిని కాలరాసిందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన భూముల్లో గిరిజనులు పంటలు పండించుకుంటుంటే.. టీఆర్ఎస్ పాలకులు.. పంటలను తోక్కిస్తూ.. ఇదేమని అడిగిన వాళ్ళను చెట్లకు కట్టి కొట్టించిన సందర్భాలు ఉన్నాయని అన్నారు. గిరిజనులకు ఇంత ద్రోహం చేసిన టీఆర్ఎస్ పార్టీలోకి ఒక గిరిజనుడైన కాంతారావు ఎలా చేరడానికి ఆయన అడిగారు. 
 ప్రజాపరిరక్షణ యాత్రకు అనూహ్య స్పందన
కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి టీఆర్ఎస్ లో చేరిన ఎమ్మెల్యేలను నిరసిస్తూ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపట్టిన ప్రజాపరిరక్షణ యాత్రకు ప్రజలనుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. ముఖ్యంగా ఏజెన్సీ, అటవీ ప్రాంతంలో పర్యటిస్తున్న భట్టి యాత్రకు గిరిజనులు పెద్ద ఎత్తున ఎదురేగి స్వాగతం పలికారు.

No comments:
Write comments