అన్నం పెట్టే ప్రభుత్వాన్నీ ఆదరించాలి గాని సున్నం పెట్టిన అభ్యర్థులను కాదు

 

ఎన్నికల ప్రచారంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్
మహబూబ్ నగర్, ఏప్రిల్ 3, (globelmedianews.com)
మహబుబ్ నగర్ పార్లమెంట్ ఫరిధిలో అభ్యర్థి మన్నే శ్రీనివాస్ రెడ్డితో కలిసి మంత్రి డాక్టర్ వీ శ్రీనివాస్ గౌడ్  తెరాస ఎన్నికల ప్రచారంలో వేగం పెంచారు. బుధవారం మహబుబ్ నగర్ జిల్లా కేంద్రంలోని శ్రీనివాస కాలనీ ఏనుగొండ తదితర ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించారు.  శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ దేశ చరిత్రలోనే ఇంత భారీ స్థాయిలో సంక్షేమ కార్యక్రమాలు అమలు పరుస్తోన్న ప్రభుత్వం తమదేన్నన్నారు.. 24 గంటలు సురక్షిత మంచినీరు, కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్,  పింఛన్లు, మాతా శిశు సంరక్షణ,  సుఖ ప్రసవం కోసం 104 అంబులెన్సులు,  ప్రసవనంతరం 12000-13000  ఇస్తూ పుట్టినప్పటినుండీ మరణించేదాక పేద ప్రజలకు అండ నిలుస్తుండటం వల్లే తమ పేదల ప్రభుత్వంగా ప్రసిదిద్దికెక్కిందన్నారు. 


అన్నం పెట్టే ప్రభుత్వాన్నీ ఆదరించాలి గాని సున్నం పెట్టిన అభ్యర్థులను కాదు

గద్వాల్,  కల్వకుర్తిలో ప్రజల తిరస్కరణకు గురైన అభ్యర్థులు పాలమూరుకు ఏం వెలగబెడతారని పోటీలో ఉన్నారని ఎద్దేవా చేశారు.  అన్నం పెట్టే ప్రభుత్వాలను ఆదరించాలి గాని సున్నం పెట్టిన అభ్యర్థులను కాదన్నారు. రైతు కుటుంబం నుండి వచ్చి కష్టపడి ఫార్మా కంపెనీల అధినేత గా ఎదిగిన స్థానికుడు మన్నే శ్రీనివాస్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.  అభ్యర్ధి మన్నే శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ స్థానికుడినైన తనకు ఇక్కడి ప్రాంత సమస్యలపై అవగాహన ఉందన్నారు. తనను ఆశీర్వదిస్తే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేసేందుకు కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో పుర చైర్ పర్సన్ రాధా అమర్,  తెరాస పట్టణ అధ్యక్షుడు కోరమోని వెంకటయ్య, కౌన్సిలర్లు కోరమోని వనజ కోరమోని జ్యోతి తదితరులు పాల్గొన్నారు

No comments:
Write comments