వరంగల్ మేయర్ గా గుండా ప్రకాశ్ ఏకగ్రీవ ఎన్నిక

 

హైదరాబాద్ ఏప్రిల్ 27 (globelmedianews.com
గ్రేటర్ వరంగల్  మేయర్ గా గుండా ప్రకాశ్ రావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు ఎన్నికల అధికారి ప్రశాంత్ జీవన్ పాటిల్ అధికారిక ప్రకటన చేశారు. వరంగల్‌ నగర మేయర్‌ అభ్యర్థి పేరు ఖరారుపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. గుండా ప్రకాశ్‌ రావు పేరును తెరాస అధిష్ఠానం ఖరారు చేసింది. ప్రకాశ్‌ పేరును తెరాస పరిశీలకులు గ్యాదరి బాలమల్లు ప్రకటించారు. 


వరంగల్ మేయర్ గా గుండా ప్రకాశ్ ఏకగ్రీవ ఎన్నిక

గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశం శనివారం జరిగింది. గుండా ప్రకాశ్ పేరును కార్పొరేటర్లు   వద్దిరాజు గణేశ్, అర్షిత రెడ్డి, బయ్యస్వామి ప్రతిపాదించారు. మేయర్ బరిలో ఎవరూ లేకపోవడంతో గుండా ప్రకాశ్ ను ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ప్రశాంత్ జీవన్ పాటిల్ తెలిపారు. కాగా, ఎన్నికకు ఒకరోజు ముందుగా ప్రకాశ్ రావు పేరును టీఆర్ఎస్ అధికారికంగా ప్రకటించింది. గ్రేటర్ వరంగల్ మేయర్ పదవి జనరల్ కేటగిరికి రిజర్వ్ అయింది.ఉప ఎన్నికలో ఎన్నికైన 19వ  డివిజన్ కార్పొరేటర్ నాగరాజుచే ప్రమాణ స్వీకారం చేయించారు. మిగతా కార్పొరేటర్లు ఏకగ్రీవంగా బలపరిచి ప్రకాశ్‌కు మద్దతు తెలిపారు. దీంతో మేయర్‌గా గుండా ప్రకాశ్‌ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు జిల్లా కలెక్టర్  ప్రకటించారు.

No comments:
Write comments