పార్టీ నేతల ఆరెస్టును ఖండించిన బీజేపీ

 

హైదరాబాద్, ఏప్రిల్ 30 (globelmedianews.com)
ఇంటర్ విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ప్రజాస్వామ్య బద్దంగా, శాంతియుతంగా బిజెపి రాష్ట్ర అధ్యక్షులు డా.కె.లక్ష్మన్ చేస్తున్న నిరవధిక నిరాహారదీక్షను అప్రజాస్వామికంగా అడ్డుకొని అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ మంగళవారం హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ వద్దనున్న బాబాసాహెబ్ డా. బి.ఆర్.అంబేద్కర్ విగ్రహం వద్ద తలపెట్టిన బిజెపి నేతల నిరసన కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకోవడాన్ని బిజెపి తెలంగాణ శాఖ తీవ్రంగా ఖండిస్తోంది. 


పార్టీ నేతల ఆరెస్టును ఖండించిన బీజేపీ

నిరసన తెలియజేయడానికి విచ్చేస్తున్న పార్లమెంట్ సభ్యులు  బండారు దత్తాత్రేయ, శాసనమండలి పక్షనాయకులు  ఎన్.రాంచందర్ రావు, బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు  చింతా సాంబమూర్తి,  జి.ప్రేమేందర్ రెడ్డి, ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు  కాటం నర్సింహా యాదవ్, బిజెపి నగర ప్రధాన కార్యదర్శి  గౌతంరావు, నగర మాజీ డిప్యూటీ మేయర్  సుభాష్ చందర్, మీడియా కమిటీ కన్వీనర్ సుధాకర్ శర్మ తదితరులతో పాటు వందలాది బిజెపి నాయకులను ఎక్కడిక్కడ అరెస్టు చేసి వివిధ పోలీస్ స్టేషన్లలో నిర్బంధించడం అప్రజాస్వామికమని పార్టీ పేర్కోంది. 
ప్రగతి భవన్ వద్ద నిరసన కార్యక్రమానికి వెళ్తున్న యువమోర్చా రాష్ట్ర అధ్యక్షులు  గుండగోని భరత్ గౌడ్, యువమోర్చా జాతీయ కార్యదర్శి  బద్దం మహిపాల్ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ నాయుడుతో పాటు తదితరులు అరెస్టు చేసి వివిధ పోలీస్ స్టేషన్లలో నిర్బంధించడాన్ని రాష్ట్ర శాఖ తీవ్రంగా ఖండించింది. 

No comments:
Write comments