చంద్రబాబు సమీక్షలు తప్పా

 

గుంటూరు ఏప్రిల్ 25 (globelmedianews.com)  
ఎన్నికల కమిషన్ విధులను కూడా సీఎస్ తన చేతుల్లోకి తీసుకోవడం విడ్డూరంగా  ఉంది. సీఎస్  తీరు  రాజ్యాంగ విరుద్ధం, అప్రజాస్వామికమని మంత్రి నక్కా అనంద్ బాబు అన్నారు. గురువారం అయన మీడియాతో మాట్లాడారు. చరిత్రలో ఎన్నడూ ఇలాంటి ఎన్నికల ప్రక్రియ చూడలేదు. వీళ్ళ వ్యవహారాలు చూస్తేంటే  ఏదో కుట్ర జరుగుతుందని తెలుస్తుంది. మోడీ, కేసిఆర్, జగన్ లు కలసి చంద్రబాబు పై కుట్ర పన్నారు.  టిడిపి ఫిర్యాదు చేస్తే ఈసీ పట్టించుకునే పరిస్థితి లేదు. ఏ2 విజయ సాయి రెడ్డి నోటి నుంచి మాట రాగానే ఈసి చర్యలకు సిద్దమౌతుందని ఆరోపించారు. పోలింగ్ రోజున ఎన్నో కుట్రలు చేశారు.


చంద్రబాబు సమీక్షలు తప్పా

మరల కౌంటింగ్ రోజు కూడా కుట్రలకు సిద్దం అవుతున్నారు. మోడి ని నమ్ముకున్న జగన్ నట్టేట మునగబోతున్నాడు. ఏపికి ఆర్దిక నేరాలు పరిచయం చేసిన గజదొంగ విజయసాయి రెడ్డి. విజయ సాయి సలహా లతో వైఎస్ కుటుంబం రాష్టాన్ని సర్వనాశనం చేసింది. సీఎస్ ద్వారా ప్రజలకు అందాల్సిన పధకాలకు ఆటంకం కల్గిస్తున్నారని విమర్శించారు. ప్రజలు చంద్రబాబు ను సీఎంగా  ఎన్నుకున్నారు. ఎల్వీ సుబ్రమణ్యం ను సీఎస్ గా ప్రజలు ఎన్నుకోలేదు. ఎల్వీ సుబ్రమణ్యం తో చెప్పుంచుకునే స్దితిలో చంద్రబాబు లేడు. కేంద్రం లో మోడి అన్ని సమీక్షలు చేస్తుంటే లేని తప్పు , ఏపిలో ప్రజా సంక్షేమం పై సమీక్షలు చేస్తా తప్పా అని ప్రశ్నించారు. కేంద్రం లో బిజెపి అడ్రస్ లేకుండా పోబోతుంది.  ఏపిలో టిడిపి ఖచ్చితంగా అధికారంలోకి రాబోతుందని మంత్రి అన్నారు. 

No comments:
Write comments