చిన్నారిని కాపాడిన ఫైర్ మెన్ కు చిరంజీవి అభినందన

 

హైదరాబాద్, ఏప్రిల్,23(globelmedianews.com):
చిన్నారిని మృత్యువు నుండి కాపాడిన ఫైర్ మెన్  క్రాంతికుమార్ ను మెగాస్టార్  చిరంజీవి అభినందించారు. 
భారీ వర్షాలు సందర్భంగా ప్రమాదవశాత్తు హైదరాబాద్ గౌలీగూడ  నాలాలో పడిపోయిన నాలుగు సంవత్సరాల దివ్యను ఆదివారం అగ్నిమాపక సిబ్బంది మృత్యువు నుండి కాపాడారు. ఈ సమాచారాన్ని వార్త పత్రికల ద్వారా తెలుసుకున్న చిరంజీవి వెంటనే  క్రాంతి కుమార్ ను అభినందించారు. 


చిన్నారిని కాపాడిన ఫైర్ మెన్ కు చిరంజీవి అభినందన

అయనకు చిరంజీవి ఛారిటబుల్ ట్రస్టు తరపున లక్ష రూపాయలు బహుమతిగా    చిరంజీవి ఛారిటబుల్ ట్రస్టు మేనేజింగ్ ట్రస్టు  అల్లు అరవింద్ గారి చేతుల మీదుగా అందజేసారు. విధి నిర్వహణలో క్రాంతి కుమార్ కు సహకరించిన ఫైర్ సిబ్బందినీ, గౌలిగూడ స్టేషన్ ఫైర్ ఆఫీసర్ జయరాజ్ కుమార్ ని ప్రత్యేకంగా అభినందించారు. అదే విధంగా రక్షింపబడ్డ నాలుగేళ్ల  బాలికను కూడా ఆదుకుంటామని  అల్లు అరవింద్ ఒక ప్రకటనలో తెలిపారు.

No comments:
Write comments