ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో మెరుగైన సౌకర్యాలు

 

''భక్తులతో భవదీయుడు'' -
టిటిడి తిరుపతి జెఈవో లక్ష్మీకాంతం
తిరుపతి ఏప్రిల్ 26 (globelmedianews.com),
ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి ఆలయానికి విచ్చేసే భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నట్లు టిటిడి తిరుపతి జెఈవో  బి.లక్ష్మీకాంతం అన్నారు. ''భక్తులతో భవదీయుడు'' కార్యక్రమం తిరుపతి టిటిడి పరిపాలన భవనంలో గల జెఈవో కార్యాలయంలో శుక్రవారం ఉదయం జరిగింది.  ఈ సందర్భంగా భక్తులతో భవదీయుడు కార్యక్రమంలో పలువురు భక్తులు ఫోన్ఇన్ ద్వారా జెఈవోకు తెలియజేశారు. కాకినాడకు చెందిన సుధారాణి ఒంటిమిట్టలో టిటిడి ఏర్పాట్లను ప్రశంసించారు, మరిన్ని సౌకర్యాలను కల్పించాలని కోరారు.దీనిపై జెఈవో మాట్లాడుతూ ఇటీవల ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి కల్యాణాన్ని రాష్ట్ర పండుగగా వైభవంగా నిర్వహించాం, కల్యాణానికి విచ్చేసే భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా టిటిడి ఏర్పాటు చేసిన అన్నప్రసాదాలు, తాగునీరు, మరుగుదొడ్లు, తదితర సౌకర్యాలపై భక్తులు సంతృప్తి వ్యక్తం చేశారన్నారు. అదేవిధంగా తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి విచ్చేసే భక్తులు వేచి ఉండే గదులను ఆస్థాన మండపం సెల్లార్లోని పాత అన్నప్రసాద భవనంలో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.విజయవాడకు చెందిన కృష్ణరావు, ప్రభాకర్రాజు టిటిడి కల్యాణ మండపాలను ఆధునీకరించాలని కోరారు.


ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో మెరుగైన సౌకర్యాలు 

జెఈవో మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఉన్న టిటిడి కల్యాణ మండపాలను దశలవారీగా ఆధునీకరించనున్నట్లు తెలిపారు. టిటిడి కల్యాణ మండపాలను ఐఎస్వో సూచనలకు అనుగుణంగా రూపొందిస్తామన్నారు. ఆయా కల్యాణ మండపాల పరిధిలోని డెప్యూటీ ఈవోలు, ఇఇలు ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించేల చర్యలు చేపట్టామన్నారు.   శ్రీకాళహస్తికి చెందిన శ్రీనివాస్ తిరుపతిలోని శ్రీనివాసం వసతి సమూదాయంలో రాక పోకల సమయంపై భక్తులకు అవగాహన కల్పించాలని కోరారు..  జెఈవో మాట్లాడుతూ టిటిడి వసతి సముదాయాలలో రాక పోకల సమయాలపై సీనియర్ అధికారులతో కమిటీని ఏర్పాటు చేసి విధివిధానాలు రూపొందిస్తామన్నారు.  విజయవాడకు చెందిన జహ్నవి ''రాష్ట్రంలోని అన్ని ముఖ్య పట్టణాలలో టిటిడి ఆధ్వర్యంలో విద్యా, వైద్య సేవలను'' ఏర్పాటు చేయాలని కోరారు.  దీనిపై జెఈవో స్పందిస్తు  దేశంలోని అన్ని ప్రధాన పట్టణాలలో దివ్వక్షేత్రాలు నిర్మిస్తున్నాం. అందులో భాగంగా ఇటీవల హైదరాబాదులో శ్రీవారి ఆలయన్ని భక్తులకు అందుబాటులోనికి తీసుకువచ్చాం. ప్రతి జిల్లాలో టిటిడి విద్యా సంస్థలు, వైద్య శాలలు ఏర్పాటు చేసేందుకు గల అవకాశాన్ని పరిశీలిస్తామన్నారు. కృష్ణాజిల్లా నుండి ప్రభాకర్రాజు రాష్ట్రంలోని ప్రముఖ రైల్వేస్టేషన్లలో టిటిడి ప్రచురణలు లభ్యమయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరారు. జెఈవో మాట్లాడుతూ టిటిడి ప్రచురణలు తిరుపతి తదితర రైల్వే స్టేషన్లోని బుక్స్టాల్స్ ఉన్నాయని, భక్తులు టిటిడి వెబ్పైట్లో ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చాన్నారు.  అనంతపురం నుండి రవికుమార్ శ్రీవారిసేవకులు ఆన్లైన్లో సేవలు పొందేందుకు చాలా ఇబ్బంది పడుతున్నారని, శ్రీవారిసేవకులు సులభంగా సేవకు నమోదు చేసుకునేందుకు వీలు కల్పించాలని కోరారు. ఈవో స్పందిస్తు సంబంధిత అధికారులతో మాట్లాడి తగు చర్యలు తీసుకుంటామన్నారు. శ్రీవారిసేవకులు టిటిడిలోని వివిధ విభాగాలలో అందిస్తున్న సేవలపై డాక్యుమెంటరి రూపొందించామని, త్వరలో ఎస్వీబీసిలో ప్రసారం చేయనున్నట్లు తెలిపారు. 

No comments:
Write comments