యేడాది సమస్య.. గంటలో పరిష్కారం..

 

చేర్యాల వాసి బాలయ్యకు రేషను కార్డు మంజూరు 
- ట్విట్టర్ ట్వీట్ స్పందించి కార్డు మంజూరు చేయించిన కలెక్టర్ 
చేర్యాల, ఏప్రిల్ 03 :(globelmedianews.com)  
యేడాదిగా ఎదురు చూపులు చూసిన  సమస్యకు  గంటలో పరిష్కారం లభించింది. వివరాల్లోకి వెళితే మండల కేంద్రమైన చేర్యాల గ్రామస్తుడు తడ్కపల్లి బాల నర్సింలు రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకుని యేడాది పూర్తయ్యిందని, ఇప్పటికీ రాలేదని జిల్లా కలెక్టర్ అధికారిక ట్విట్టర్ కు మీ సేవ దరఖాస్తు వివరాలతో విన్నవించారు. 


యేడాది సమస్య.. గంటలో పరిష్కారం..

స్పందించిన కలెక్టర్ కృష్ణ భాస్కర్  జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి వెంకటేశ్వర్లుతో మాట్లాడి వెంటనే రేషన్ కార్డు ఇవ్వాలని ఆదేశించగా బుధవారం ఫుడ్ సెక్యూరిటీ మంజూరు చేశారు. ఈ మేరకు ఎఫ్ ఎస్ 021801076210 కార్డు మంజూరు చేయడం జరిగిందని, ఈ రోజున మీ రేషను షాపులో బియ్యం పొందవచ్చని, మీ ఫిర్యాదును స్వీకరించి జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి వెంకటేశ్వర్లు కార్డు మంజూరు చేయించినట్లు తడ్కపల్లి బాల నర్సింలుకు రీట్వీట్ లో జిల్లా కలెక్టర్ వెల్లడించారు. 

No comments:
Write comments