గులాబీ ఎంపీలను గెలిపించండి

 

నల్లగొండ, ఏప్రిల్ 9, (globelmedianews.com)
అసెంబ్లీ ఎన్నికల్లో నల్లగొండ జిల్లా ప్రజలు చైతన్యం ప్రదర్శించి, కాంగ్రెస్ మహామహులను మట్టికరిపించారని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. నల్లగొండలో ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి నరసింహారెడ్డికి మద్దతుగా నిర్వహించిన రోడ్‌షోలో కేటీఆర్ పాల్గొన్నారు. వివేకానంద విగ్రహం నుంచి క్లాక్‌టవర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించగా.. కేటీఆర్‌కు జనాలు నీరాజనాలు పలికారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ఎంపీలు గెలిస్తే రాహుల్‌కు మాత్రమే లాభం. బీజేపీ ఎంపీలు గెలిస్తే మోదీకి మాత్రమే లాభం. టీఆర్‌ఎస్ ఎంపీలు గెలిస్తే తెలంగాణ మొత్తానికి లాభమన్నారు. 


గులాబీ ఎంపీలను గెలిపించండి

ఐదేళ్లలో దేశానికి మోదీ చేసిందేమీలేదని మండిపడ్డారు. మోదీ వేడి తగ్గింది..150 సీట్లు కూడా రావు. రాహుల్‌గాంధీకి 100 సీట్లు కూడా రావు. ఆలోచించి కాంగ్రెస్, బీజేపీని దెబ్బకొట్టాలని పిలుపునిచ్చారు. 16 మంది టీఆర్‌ఎస్ ఎంపీలు గెలిస్తే ఢిల్లీ జుట్టు మన చేతుల్లో ఉంటుంది. ఇద్దరే ఇద్దరు ఎంపీలతో తెలంగాణ తెచ్చిన మొనగాడు కేసీఆర్ అని కేటీఆర్ అన్నారు. నాన్‌బీజేపీ..నాన్ కాంగ్రెస్ పార్టీలే ఎక్కువ సీట్లు గెలుచుకోబోతున్నాయి. ఢిల్లీలో సంఖ్యాబలం ఉన్నోళ్లదే పెత్తనం. చంద్రబాబు సంఖ్యాబలంతో ఏడు మండలాలను ఏపీలో కలిపాడు. రైల్వే మంత్రి ఎవరుంటే వాళ్ల రాష్ర్టాలు, ప్రాంతాలకే రైళ్లు పోతున్నయి. కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు ఢిల్లీ దర్బార్‌లో గులాములని కేటీఆర్ ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ఎంపీలు రాహుల్ కూర్చోమంటే కూర్చోవాలి..నిలబడమంటే నిలబడాలని ఎద్దేవా 

No comments:
Write comments