సీబీడీటీ ఛైర్మన్‌, రెవెన్యూ సెక్రటరీకి ఈసీ పిలుపు

 

ముంబయి ఏప్రిల్ 9 (globelmedianews.com)
ఇటీవల ఆదాయపు పన్నుశాఖ దాడులపై కాంగ్రెస్‌ పార్టీ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం దేశవ్యాప్తంగా జరుగుతున్న ఆదాయపు పన్ను శాఖ దాడులపై మాట్లాడేందుకు సీబీడీటీ ఛైర్మన్‌, రెవెన్యూ సెక్రటరీలను కేంద్ర ఎన్నికల సంఘం పిలిచింది. దీంతో రెవెన్యూ సెక్రటరీ పాండే, సీబీడీటీ ఛైర్మన్‌ పి.సి.మోడే నేడు ఈసీ వద్దకు వెళ్లనున్నారు. 


సీబీడీటీ ఛైర్మన్‌, రెవెన్యూ సెక్రటరీకి ఈసీ పిలుపు

భాజపా వివిధ శాఖలను దుర్వినియోగం చేస్తోందని మండిపడింది. దీంతో ఇప్పటికే ఆదివారం ఈసీ దీనిపై స్పందిస్తూ ఆర్థిక శాఖకు సూచనలు జారీ చేసింది. ఆ శాఖకు సంబంధించిన ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగాలు దాడులు ఏవైనా నిష్పాక్షికంగా చేయాలని, వేధింపులు వద్దని సూచించింది.ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చాక ఐటీ శాఖ పలువురు నేతలపై దాడులను నిర్వహించింది. దీంతో తమను లక్ష్యంగా చేసుకొని దాడులు చేస్తున్నారని విపక్ష పార్టీలు మోదీ ప్రభుత్వ తీరుపై విమర్శలు చేస్తున్నాయి. లెక్కలు చూపని రూ.281 కోట్లను సోమవారం ఆదాయపన్ను శాఖ స్వాధీనం చేసుకుంది.

No comments:
Write comments