క్షేత్రంలో కవీంద్ర తీర్థుల ఉత్తరారాధన

 

శ్రీమఠం పీఠాధిపతుల ప్రత్యేక పూజలు
 ఆరాధన ఉత్సవాలలో పాల్గొన్న భక్తి జనవాహిని
మంత్రాలయం, ఏప్రిల్ 15  (globelmedianews.com)
కర్ణాటక రాష్ట్రం హంపి క్షేత్ర పరిధిలోని నవ బృందావన గడ్డ శ్రీ క్షేత్రంలో  శ్రీ శ్రీ శ్రీ కవీంద్ర తీర్థులఆరాధన మహోత్సవకార్యక్రమాన్ని మంత్రాలయం శ్రీమఠం పీఠాధిపతులు శ్రీ సుబుదేంధ్రతీర్థులు  అశేష భక్త జనవాహిని మధ్య అత్యంత వైభవంగా నిర్వహించారు. మూడు రోజులుగా జరుగుతున్న ఈ ఆరాధనోత్సవాలు సోమవారంతో అత్యంత వైభవంగా ముగిశాయి. 
 

 క్షేత్రంలో కవీంద్ర తీర్థుల ఉత్తరారాధన

శ్రీ క్షేత్రం బృందావన గడ్డ లోని కవీంద్ర తీర్థుల బృందావనానికి పీఠాధిపతులు ఆరాధన ఉత్సవాలలో భాగంగా నిర్మాల్యము, పంచామృతాభిషేకము, విశేష పుష్పాలంకరణ గావించి మహామంగళహారతి నిర్వహించారు.శ్రీబ్రహ్మ ఖరచిత మూలరామదేవరు, జయ, దిగ్విజయ, మూర్తులకు  క్షీరాభిషేకము, పంచామృతాభిషేకము వంటి విశేష పూజలు నిర్వహించారు. సమర్పించారు .ఈ ఆరాధన ఉత్సవాలను తిలకించడానికి శ్రీక్షేత్రం పరిధిలోని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని బృందావనాన్ని దర్శించుకున్నారు. పీఠాధిపతులు శ్రీ సుబూదేంధ్ర తీర్థులు భక్తులకు ఫల మంత్ర అక్షతలు ఇచ్చి ఆశీర్వదించారు.

No comments:
Write comments