నరసాపురం వైసీపీ ఎంపీ అభ్యర్థి కృష్ణం రాజు ఇంటిపై సీబీఐ దాడులు

 

హైదరాబాద్ ఏప్రిల్ 30 (globelmedianews.com)
నరసాపురం వైసీపీ ఎంపీ అభ్యర్థి, ప్రముఖ పారిశ్రామికవేత్త రఘురామ కృష్ణం రాజు ఇంటిపై సీబీఐ దాడులు జరుగుతున్నాయి. మంగళవారం ఉదయం హైదరాబాద్‌లోని రఘురాజు ఇంటికి చేరుకున్న సీబీఐ అధికారులు సోదాలు చేస్తున్నారు. కాగా..గచ్చిబౌలిలోని ఎమ్మార్ ప్రాపర్టీస్‌లో రఘరామకృష్ణంరాజు నివాసం ఉంటున్నారు. అయితే ఎందుకు సోదాలు చేస్తున్నారు.. ఎవరైనా ఫిర్యాదు చేశారా.. లేకుంటే ఆయన బ్యాంకులకు చెల్లించిన సొమ్మును తిరిగివ్వకపోవడంతో ఫిర్యాదులు అందాయని దాడులు చేస్తున్నారా..అనే విషయం ఇంకా తెలియరాలేదు.ఇదిలా ఉంటే..గతంలో బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని, వాటిని తిరిగి చెల్లించడంలో రఘురామకృష్ణంరాజు కంపెనీలు విఫలం అయ్యాయనే ఆరోపణలున్న సంగతి తెలిసిందే. బ్యాంకులకు రుణాల ఎగవేతపై గతంలోనే కేసు నమోదు చేసిన సీబీఐ విచారణలో భాగంగా ఎమ్మార్‌లో ఉన్న ఆయన నివాసంపై దాడి చేసింది. బెంగళూరు నుంచి వచ్చిన పలువురు అధికారులు ప్రస్తుతం ఆయన ఇంట్లో సోదాలు జరుపుతున్నట్లు సమాచారం.నరసాపురం వైసీపీ ఎంపీ అభ్యర్థి కృష్ణం రాజు ఇంటిపై సీబీఐ దాడులు

బ్యాంకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీబీఐ అధికారుల సోదా: కృష్ణంరాజు
సీబీఐ అధికారులు చేసిన దాడులపై స్పందించిన కృష్ణంరాజు మీడియాతో మాట్లాడుతూ.. బ్యాంకులో రూ.600కోట్ల రుణం విషయంపై బ్యాంకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీబీఐ అధికారులు వచ్చారని, తమ కంపెనీకి చెందిన లావాదేవీల విషయంలో ప్రశ్నించడం జరిగిందని అన్నారు. సీబీఐ దాడులు, సోదాలు వంటివి ఏమి లేవని, సీబీఐ అధికారులు అడిగిన ప్రశ్నలన్నింటికి సమాధానం చెప్పానని తెలిపారు.ఎన్నికల ముందు ఒకసారి అధికారులు వచ్చి తన స్టేట్మెంట్ తీసుకున్నారని, మళ్ళీ ఇప్పుడు వచ్చి తన స్టేట్మెంట్ తీసుకున్నారని రఘురామ కృష్ణంరాజు చెప్పారు. చట్టాలపై తనకు పూర్తి విశ్వాసం ఉందని, చట్టం తన పని తాను చేసుకుంటుందని అన్నారు. రూ. 600 కోట్ల అప్పు ఉన్న మాట వాస్తవమేనని తమ పవర్ ప్రాజెక్ట్ కంపెనీలో నష్టాల వల్ల బ్యాంకుకు రుణం తిరిగి చెల్లించలేకపోయామని తెలిపారు. బ్యాంకుకు వన్ టైం సెటల్మెంట్ చేసుకునేందుకు దరఖాస్తు చేశామన్నారు. తాజాగా జరిగిన ఎన్నికలపై కూడా రఘు రామ కృష్ణం రాజు స్పందించారు. నరసాపురంలో తాను లక్ష 20వేల మెజారిటీతో గెలుస్తానని, ఆంధ్రప్రదే‌శ్‌లో 120 సీట్లతో వైసీపీ అధికారంలోకి వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

No comments:
Write comments