అవినీతి సోమ్మును వెదజల్లుతున్న వైకాపా

 

అమరావతి, ఏప్రిల్ 9, (globelmedianews.com
వైకాపా అధినేత జగన్,  తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ప్రధాని  మోడీ చెప్పేవన్నీ అబద్ధాలేనని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. మంగళవారం ఉదయం ఎలక్షన్ మిషన్ 2019పై పార్టీ నేతలతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్లో అయన  మాట్లాడారు. ఏపీ నీళ్లు, ఏపీ హోదా, ఏపీ ఉపాధిపై టీఆర్ఎస్ దాడి చేస్తోందని విమర్శించారు. ఏపీకి హోదాను తెలంగాణ ఎన్నికల్లో కేసీఆర్ వ్యతిరేకించారన్నారు. ఏపీ అసెంబ్లి ఎన్నికల ముందు జగన్కు మేలుచేయడానికే కేసీఆర్ హోదా డ్రామా ఆడుతున్నారన్నారు. కేసీఆర్, రామ్మాధవ్, జగన్ వ్యాఖ్యలే మూడు పార్టీల లాలూచీకి రుజువని చెప్పారు. ‘‘ఆంధ్రా బాగుండాలని ఉంటే కేసీఆర్ అఫిడవిట్లు వేస్తారా గోదావరి నదిపై నాలుగు ప్రాజెక్టులను, కృష్ణా నదిపై 9 ప్రాజెక్టులు కేసీఆర్ అడ్డుకున్నారని ఆరోపించారు. ముచ్చుమర్రి, పోతిరెడ్డిపాడుకు కేసీఆర్ ఎందుకు వ్యతిరేకమో అడిగితే జవాబు చెప్పడం లేదన్నారు..


అవినీతి సోమ్మును వెదజల్లుతున్న వైకాపా

ప్రభుత్వ సంక్షేమ పథకాలే టీడీపీకి శ్రీరామ రక్ష అని సీఎం చంద్రబాబు అన్నారు. రాష్ట్ర ప్రజలంతా ఏకపక్షంగా టీడీపీకే మద్దతు ఇస్తున్నారని చెప్పారు. అవినీతి సొమ్మును వైసీపీ వెదజల్లుతోందని మండిపడ్డారు. దేశమంతా మోదీ వ్యతిరేక గాలి వీస్తోందన్నారు. అన్ని సర్వేలు టీడీపీకే అనుకూలమని చెప్పాయని సీఎం తెలిపారు. ‘‘తెలంగాణలో 25 లక్షల ఓట్ల తొలగింపునకు కేసీఆర్ తెగించారు. అదే కుట్ర చేద్దామని చూసి జగన్ భంగపడ్డాడు.  టీడీపీ సేవామిత్ర యాప్పై కేసీఆర్ దాడి జగన్ కోసమే. డేటా సమాచారం దొంగిలించి వైసీపీకి ఇవ్వడం నేరం. ఏపీ హోదా, ఉపాధి, నీళ్లపై టీఆర్ఎస్ దాడి. ఏపీకి హోదాను తెలంగాణ ఎన్నికల్లో కేసీఆర్ వ్యతిరేకించారని చంద్రబాబు విమర్శించారు.  దొంగదెబ్బ తీయడం దుర్మార్గుల అలవాటనీ, వైసీపీ అవినీతి సొమ్మును వెదజల్లుతోందని చంద్రబాబు ఆరోపించారు.

No comments:
Write comments