కోసిగిలో బాంబులు కలకలం

 

ఎమ్మిగనూరు, ఏప్రిల్ 9 (globelmedianews.com)
కర్నూలు జిల్లాలోని కోసిగిలో బాంబుల కలకలం చోటుచేసుకుంది. టీడీపీ నాయకుడు, ఆంజనేయస్వామి ఆలయ అధ్యక్షుడు అయ్యన్న ఇంటి కాంపౌండ్ లో బాంబులు ఉన్నాయని గుర్తుతెలియని వ్యక్తులు ఇచ్చిన సమాచారం మేరకు మంగళవారం మధ్యాహ్నం కోస్గి పోలీసులు సోదాలు నిర్వహించారు. 


 కోసిగిలో బాంబులు కలకలం

ఈ సోదాల్లో అయ్యన్న ఇంటి నివాసం ముందు కాంపౌండ్ లో ఓ స్కూల్ బ్యాగులో బాంబులు ఉండటాన్ని పోలీసులు గుర్తించారు. అనంతరం వాటిని నీళ్ళ బకెట్ లో వేసుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు. ప్రస్తుతం ఆ బాంబులు అక్కడికి ఎలా వచ్చాయి, వీటి వెనుక ఉన్న వ్యక్తి ఎవరనే కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

No comments:
Write comments