ప్రతి నియోజకవర్గంలో గులాబీ దళం

 

హైద్రాబాద్, ఏప్రిల్ 27 (globelmedianews.com
తెలంగాణ భవన్ లో టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ సభ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, గులాబీ సైనికులకు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని అన్నారు. 2001లో కేసీఆర్ ఒంటరిగా ఉద్యమం మొదలు పెట్టారని, పద్దెనిమిదేళ్ల పాటు తెలంగాణ పోరాటంతో రాష్ట్రాన్ని సాధించుకున్నామని అన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం కేసీఆర్ తోనే సాధ్యమైందని నాడు ప్రణబ్ ముఖర్జీ ప్రశంసించిన విషయాన్ని గుర్తుచేశారు. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా పార్టీ ఉండాలని అన్నారు. త్యాగాల పునాదుల మీదనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుందని నాడు కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. మాటపై నిలబడి ఆనాడు తన పదవులకు రాజీనామా చేసిన వ్యక్తి కేసీఆర్ అని కొనియాడారు.రాష్ట్రంలో ఎన్నో పార్టీలు పుట్టుకొచ్చాయి కానీ, గట్టిగా నిలబడ్డ పార్టీ మాత్రం టీఆర్ఎస్ పార్టీనే అని అన్నారు. 2001లో వేల సంఖ్యలో ఉన్న పార్టీ కార్యకర్తలు నేడు లక్షల సంఖ్యకు చేరారని అన్నారు.


ప్రతి నియోజకవర్గంలో గులాబీ దళం

71 ఏండ్ల చరిత్రలో రాష్ట్రంలో ఎన్నో పార్టీలు పుట్టుకొచ్చాయి. కానీ గట్టిగా నిలబడ్డ పార్టీ టీఆర్‌ఎస్ మాత్రమేనన్నారు. తెలుగు ప్రజల కోసం పార్టీలు పెట్టి విజయం సాధించిన నాయకులు ఇద్దరే ఇద్దరని ఒకరు ఎన్టీఆర్, మరొకరు కేసీఆర్ అని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశంసించారు. టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ భవన్ లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, నాడు ఎన్టీఆర్ విజయం సాధించడానికి కారణం అప్పుడు ఉన్న రాజకీయ శూన్యత, సినీ నటుడిగా ఆయనకు ఉన్న గ్లామర్ అని అభిప్రాయపడ్డారు. బలమైన సామాజిక నేపథ్యం, ఆర్థిక వనరులు లేకున్నా కేసీఆర్ విజయం సాధించారని అన్నారు. ఈ సందర్భంగా ప్రతిపక్షంపై ఆయన విమర్శలు చేశారు. ప్రభుత్వం ఎక్కడ తప్పు చేస్తుందా అని ప్రతిపక్షం ఎదురుచూస్తోందని విమర్శించారు. ఏవైనా లోపాలు ఉంటే సరిచేసుకుంటామని స్పష్టం చేశారు. పార్టీలో ఏవైనా సమస్యలు ఉంటే అంతర్గంతంగా మాట్లాడుకోవాలే తప్ప, అందరిముందు మాట్లాడొద్దని తమ నాయకులకు సూచించారు.  . 2001లో కేసీఆర్ ఒంటరిగా ఉద్యమం మొదలు పెట్టారు. త్యాగాల పునాదుల మీదనే తెలంగాణ రాష్ట్ర ఏర్పడుతుందని 2001, ఏప్రిల్ 27న కేసీఆర్ అన్నారు. 1947లో దేశానికి స్వాతంత్య్రం వస్తే 1948లో భారతదేశంలో తెలంగాణ కలిసింది. మాటమీద నిలబడుతూ ఆనాడు మూడు పదవులకు కేసీఆర్ రాజీనామా చేశారు. డిప్యూటీ స్పీకర్, శాసనసభ సభ్యత్వానికి, పార్టీ పదవికి ఆనాడు కేసీఆర్ రాజీనామా చేశారు. ఈ 18 ఏళ్ల కాలంలో ఎన్నో అడ్డంకులను అధిగమించాం. ఇప్పుడు టీఆర్‌ఎస్ పార్టీ అజేయ శక్తిగా ఎదిగింది. ఇవాళ టీఆర్‌ఎస్ అంటే తిరుగులేని రాజకీయ శక్తిగా రూపాంతరం చెందింది. అయితే ఇంకా చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. ప్రజల దీవెన మనకు మెండుగా ఉంది. కేసీఆర్ నాయకత్వాన్ని మెచ్చుకుని ముందుకు పోవాలని మరోసారి ఆశీర్వాదం ఇచ్చారు. కేసీఆర్ నాయకత్వంలో 16 ఎంపీ స్థానాలు టీఆర్‌ఎస్సే గెలువబోతుందన్న విశ్వాసం ఉందన్నారు గల్లీ నుంచి ఢిల్లీ వరకు గులాబీ జెండా ఎగురుతూ ఉందని... దీంతో మనపై మరింత బాధ్యత పెరుగుతుందన్నారు. రాబోయే ప్రతి ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరాల్సిందే.. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అత్యధిక స్థానాలు సాధిస్తుందన్న నమ్మకం ఉందని కేటీఆర్ అన్నారు.హరీశ్ రావు శుభాకాంక్షలు తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్) పార్టీ ఆవిర్భావ దినోత్సవం నేడు. ఈ నేపథ్యంలో తెలంగాణ మాజీ మంత్రి, టీఆర్ఎస్ సీనియర్ నేత తన్నీరు హరీశ్ రావు స్పందించారు. టీఆర్ఎస్ 18వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ కు, కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఉద్యమ స్ఫూర్తి కలకాలం నిలవాలని ఆకాంక్షించారు.ట్విట్టర్ లో హరీశ్ స్పందిస్తూ..  ‘గౌరవ శ్రీ కేసీఆర్ గారికి, టిఆర్ఎస్ కార్యకర్తలకు పార్టీ 18వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. ఈ స్పూర్తి కలకాలం నిలవాలి. ఉద్యమ దీప్తి ఇలాగే వెలుగొందుతూ ఉండాలి’ అని ట్వీట్ చేశారు. కేసీఆర్ టీఆర్ఎస్ ను స్థాపించిన నేపథ్యంలో తీసిన ఓ ఫొటోను హరీశ్ ఈ సందర్భంగా ట్వీట్ కు జతచేశారు.

No comments:
Write comments