జోరందుకున్న బీ.జే.పీ ప్రచారం..

 

రోజు,రోజుకు పెరుగుతున్న చేరికలు..
అవినీతి రహిత పాలనే బీ.జే.పి లక్ష్యం
- అభ్యర్థి కె.ఆర్ మురహరి రెడ్డి..
ఎమ్మిగనూరు ఏప్రిల్ 1 (globelmedianews.com
ఎమ్మిగనూరు  పట్టణంలో బీ.జే.పి ప్రచారం జోరందుకుందని,అవినీతి రహిత పాలనే బీ.జే.పి లక్ష్యం అని కె.ఆర్ మురహరి రెడ్డి పేర్కొన్నారు.ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం పట్టణంలోని సోమప్ప కూడలి లోని షాపులలో ప్రచారం నిర్వహించారు.బి.జె.పి కార్యకర్తలతో,పార్టీ నాయకులతో షాపులలో తీరుగుతూ పార్టీ కరపత్రాలను పంచుతూ ఓట్లు వేయాలని కోరారు. ప్రజలనుద్దేశించి ఆయన  మాట్లాడుతూ మన దేశ ప్రధానిగా ఉన్న నరేంద్ర మోడీ పేద ప్రజలకు సంక్షేమ పథకాలను అమలు చేసి మన దేశాన్ని ముందుకు తీసుకు పోతున్నారని పేర్కొన్నారు.మన ప్రధాన మంత్రి దేశంలో ఉన్న ప్రతి పేద రైతులకు సహాయంగా రైతు భీమ పథకం అమలు చేశారు. 


జోరందుకున్న బీ.జే.పీ ప్రచారం..

ఎన్నో మౌలిక వసతులు,ప్రాజెక్టులు  చేపట్టారు.నాకు ఒక్క అవకాశం ఇస్తే పట్టణానికి మరియు నియోజకవర్గంలోని ప్రజలకు తాగునీరు సాగునీరు అందిస్తానని అలాగే యువతకు ఉద్యోగాలు కు పెద్ద పీట వేస్తాననిన,ప్రజలు వలసలు పోకుండా బనవాసి ఫారం దగ్గర పరిశ్రమలు నెలకొల్పి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని తెలియజేశారు.గ్రామాల్లో సిసిరోడ్లు, తాగునీరు అందించేందుకు,ప్రతి నిరుపేదకు ఇంటి కల సాకారం చేస్తామని చెప్పారు.నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన పథకాలు ఉచిత గ్యాస్ కనెక్షన్లు, నిర్భయ చట్టం,ముస్లిం మహిళలకు తలాక్ చట్టం తీసుకు వచ్చారని తెలియజేశారు. నేను ఎమ్మెల్యేగా గెలిస్తే ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటానని అలాగే ఎమ్మిగనూరు నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం పోరాడుతానని అన్నారు.పార్టీ కార్యాలయం లో  గోనెగండ్ల  మండలం ఒంటెడు దీన్నే గ్రామానికి  చెందిన 100 మంది తేదేపా నాయకులు భాజపా ఎమ్.పి  అభ్యర్థి పార్థసారథి ఎమ్.ఎల్.ఏ కె.ఆర్.మురహరి రెడ్డి  కండువా కప్పి ఆహ్వానించటం జరిగింది.ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

No comments:
Write comments