జక్రాన్‌ పల్లికి ఎయిర్‌పోర్టు.. కల్వకుంట్ల కవిత

 

నిజామాబాద్‌ ఏప్రిల్ 4(globelmedianews.com)
జక్రాన్‌ పల్లికి ఎయిర్‌పోర్టు రాబోతుందని.. ఇందు కోసం 800ఎకరాల భూమి చూశామని నిజామాబాద్‌ టీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థి కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. జక్రాన్‌పల్లిలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఎంపీ కవిత పాల్గొని ప్రసంగించారు. నిజామాబాద్ లో ఐటీ హబ్‌ పనులు వేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. రానున్న తరం కోసం టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పని చేస్తుందని ఆమె స్పష్టం చేశారు. 


జక్రాన్‌ పల్లికి ఎయిర్‌పోర్టు.. కల్వకుంట్ల కవిత

ఏ ఆధారం లేని ప్రజల కోసం వంద శాతం సబ్సిడీ కింద రూ.50 వేలు రుణాలు ఇచ్చామని గుర్తు చేశారు. పీఎఫ్‌ కార్డు ఉన్న బీడీ కార్మికులందరికీ మే నెల నుంచి రూ. 2వేలు పింఛన్‌ ఇస్తామన్నారు. డ్వాక్రా గ్రూపుల ద్వారా వ్యవసాయ ఉత్పత్తులను తయారు చేయిస్తామని చెప్పారు. రెండోసారి కేసీఆర్‌ను సీఎం చేసినందుకు మీకు ఏమిచ్చి రుణం తీసుకోవాలో తెలియట్లేదు అని పేర్కొన్నారు. మళ్లీ ఎంపీగా తనకు అవకాశం ఇస్తే శక్తి వంచన లేకుండా పని చేస్తాను అని ఉద్ఘాటించారు. ఈసారి ఎక్కువ మంది పోటీలో ఉన్నారు. మొదటి ఈవీఎంలో రెండో నెంబర్‌ మీద కారు గుర్తు ఉంటుంది. అది గమనించి ఓటేయాలని ప్రజలకు ఎంపీ కవిత విజ్ఞప్తి చేశారు.

No comments:
Write comments