ఇంటర్ బోర్డ్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఈ తప్పులు దొర్లాయి

 

మండిపడ్డ కోదండరాం..ఉద్యమించేందుకు సిద్ధమవుతున్న ప్రతిపక్షాలు
హైదరాబాద్ ఏప్రిల్ 27 (globelmedianews.com)  
తెలంగాణలో ‘ఇంటర్’ మంటలు ఇప్పట్లో చల్లారేలా లేవని స్పష్టమవుతోంది.  ఇంటర్ బోర్డ్ లో జరిగిన అవకతవకలు విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం ఉద్యమించేందుకు ప్రతిపక్షాలు సిద్ధమవుతున్నాయి.కోదండరాం మళ్లీ యాక్టివ్ అయ్యారు. ఎక్కడ టీఆర్ ఎస్ సర్కారు దొరుకుతుందా అని వేచిచూసిన ఆయన ఇప్పుడు అందివచ్చిన అవకాశంగా ఇంటర్ అవకతవకలపై టీఆర్ ఎస్ ను ఇరుకునపెట్టేందుకు రెడీ అయ్యారు. స్వతహాగా ప్రొఫెసర్ అయిన కోదండరాం ఇప్పుడు అదే విద్యార్థుల సమస్యలపై పోరుబాటు పట్టి తమను ఎన్నికల్లో ఓడించిన కేసీఆర్ కు షాకివ్వాలని పెద్ల ప్లానే వేశారు.


ఇంటర్ బోర్డ్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఈ తప్పులు దొర్లాయి

తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం ఎల్లుండి ఇంటర్ అవకతవకలపై మహాధర్నాకు పిలుపునిచ్చాడు. ఇంటర్ బోర్డ్ వద్ద చేపట్టే ఈ ధర్నాకు జెండాలు పక్కనపెట్టి అన్ని పార్టీలు కదిలిరావాలని పిలుపునిచ్చాడు. శనివారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఇంటర్ ఫలితాలు-దోషులు-పరిష్కారం’ అనే అంశంపై టీజేఎస్ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించింది. ఇంటర్ విద్యార్థులకు జరిగిన అన్యాయంపై ప్రభుత్వాన్ని నిలదీయాలని సమావేశం నిర్ణయించింది. ఇంటర్ బోర్డ్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఈ తప్పులు దొర్లాయని కోదండరాం మండిపడ్డారు.ఇక ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న మాజీ ఎంపీ వివేక్ సైతం 23మంది విద్యార్థుల ప్రాణాలు పోవడానికి కారణమైన కేసీఆర్ తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో మేధావులు వివిధ సంఘాల నాయకులు పాల్గొని ఇంటర్ అక్రమాలపై ఎల్లుండి ఇంటర్ బోర్డు ఎదుట మహాధర్నా నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఇలా ఇంటర్ లొల్లిలో అడ్డంగా దొరికిన కేసీఆర్ ను ఇరుకునపెట్టేందుకు కోదండరాం అందిరినీ కూడగడుతుండడం తెలంగాణ రాజకీయాల్లో వేడి పుట్టిస్తోంది.

No comments:
Write comments