కొండాకు ముందస్తు బెయిల్‌కు నిరాకరించిన నాంపల్లి కోర్టు

 

హైదరాబాద్ ఏప్రిల్ 25 (globelmedianews.com)
చేవెళ్ల ఎంపీ  అభ్యర్థి.. కాంగ్రెస్ నేత కొండా విశ్వేశ్వరరెడ్డి ముందస్తు బెయిల్‌కు నాంపల్లి కోర్టు నిరాకరణ తెలిపింది. ఎస్‌ఐ, హెడ్‌కానిస్టేబుల్‌ను నిర్బంధించిన కేసులో కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ముందస్తు బెయిల్ కోరారు. ఎన్నికల సమయంలో కొండా సహాయకుడి వద్ద గచ్చిబౌలి పోలీసులు రూ. 10 లక్షలు పట్టుకున్నారు. డబ్బు స్వాధీనం కేసులో ఎస్‌ఐ కృష్ణ నోటీసులు ఇచ్చేందుకు కొండా కార్యాలయానికి వెళ్లారు. కాగా తనను నిర్బంధించారని.. తనను అవమానించి విధులకు ఆటంకం కలిగించారని పేర్కొంటూ ఎస్‌ఐ కృష్ణ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. దీనికి సంబంధించిన కేసు ఒకటి నమోదైంది. విచారణ చేపట్టిన పోలీసు అధికారులు.. కొండా ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయినప్పటికీ ఆయన ఆచూకీ లభించలేదు. ఇదిలా ఉంటే.. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు కొండా వారం రోజులుగా బంజారాహిల్స్ పోలీసులు కొండా ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నా లభించలేదు. 


కొండాకు ముందస్తు బెయిల్‌కు నిరాకరించిన నాంపల్లి కోర్టు 

ఇలాంటివేళ.. ఈ కేసుకు సంబంధించిన తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ కొండా నాంపల్లి కోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు.. ఆయనకు ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు కోర్టు నో చెప్పింది. పోలీసుల ఎదుట విచారణకు రాకుండా కోర్టులో బెయిల్ కోరిన నేపథ్యంలో కోర్టు ఆయనకు ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు అంగీకరించలేదు. తాజా పరిణామాల నేపథ్యంలో కొండా తప్పనిసరిగా పోలీసుల ఎదుట విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది. మరి.. దీనికి కొండ రెస్పాన్స్ ఏమిటో చూడాలి?  విచారణకు ఆయన వస్తారా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. వారం రోజులుగా బంజారాహిల్స్ పోలీసులు కొండా ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నా లభించలేదు. ఇలాంటివేళ.. ఈ కేసుకు సంబంధించిన తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ కొండా నాంపల్లి కోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు.. ఆయనకు ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు కోర్టు నో చెప్పింది. పోలీసుల ఎదుట విచారణకు రాకుండా కోర్టులో బెయిల్ కోరిన నేపథ్యంలో కోర్టు ఆయనకు ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు అంగీకరించలేదు. తాజా పరిణామాల నేపథ్యంలో కొండా తప్పనిసరిగా పోలీసుల ఎదుట విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది. మరి.. దీనికి కొండ రెస్పాన్స్ ఏమిటో చూడాలి?  విచారణకు ఆయన వస్తారా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.టైం బాగోకపోతే ఇలానే ఉంటుందేమో?  మొన్నటి వరకూ గులాబీ ఎంపీగా దర్జాగా వ్యవహరించిన ఆయనకు.. కాంగ్రెస్ పార్టీలో చేరిన నాటి నుంచి కష్టాలు షురూ అయ్యాయి. ఒక దాని తర్వాత ఒకటి అన్నట్లుగా మీడ పడుతున్న సమస్యల నుంచి ఆయనకు ఉపశమనం లభించటం లేదు. తాజాగా అలాంటిదే మరో ఎదురుదెబ్బ ఎదురైంది. వరుస దెబ్బలతో చోటు చేసుకున్న ఒత్తిడితో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు కొండా విశ్వేశ్వరరెడ్డి.

No comments:
Write comments