రెండు గంటల్లో తిరుమల కొండ ఎక్కిన సమ్మూ

 

తిరుమల, ఏప్రిల్ 2, (globelmedianews.com)
క్కినేని కోడ‌లు స‌మంత న‌టించిన తాజా చిత్రం మ‌జిలీ. నాగ చైత‌న్య ప్ర‌ధాన పాత్ర‌లో శివ నిర్వాణ ఈ చిత్రం తెర‌కెక్కించాడు. ఏప్రిల్ 5న ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ నేప‌థ్యంలో స‌మంతతో పాటు చిత్ర యూనిట్‌కి సంబంధించిన కొంద‌రు కాలిన‌డ‌క‌న అలిపిరి నుండి తిరుమ‌ల‌కి వెళ్ళారు. సామాన్య భ‌క్తుల‌తో క‌లిసి ఆమె ఏడు కొండ‌లు ఎక్కారు. మ‌ధ్య మ‌ధ్య‌లో అభిమానుల‌తో సెల్ఫీలు దిగారు. 


రెండు గంటల్లో తిరుమల కొండ ఎక్కిన సమ్మూ

కేవ‌లం రెండు గంట‌ల‌లోనే స‌మంత తిరుమ‌ల కొండ‌కు చేరుకున్న‌ట్టు తెలుస్తుంది. చైతూ, బ్ర‌హ్మానందం కారులోనే తిరుమ‌ల కొండ‌కి చేరుకున్నారు. అయితే కొద్ది సేప‌టి క్రితం త‌న భ‌ర్త‌తో క‌లిసి తిరుమ‌ల శ్రీ వారి ఆశీర్వాదం తీసుకుంది స‌మంత‌. స్వామి ద‌ర్శ‌నం కోసం తిరుమ‌ల ఆల‌యంలోకి వెళుతున్న స‌మ‌యంలో స‌మంత‌, నాగచైత‌న్య‌లని ఫోటోగ్రాఫ‌ర్స్ త‌మ కెమెరాల‌లో బంధించారు. ప్ర‌స్తుతం ఆ ఫోటోలు సోష‌ల్ మీడియాలో విప‌రీతంగా చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. 

No comments:
Write comments