అడ్డూ, అదుపు లేని ఇసుక మాఫియా

 

నిజామాబాద్, ఏప్రిల్ 23, (globelmedianews.com)
సందట్లో సడేమీయా అనే చెందంగా ఇసు క రవాణాలో అక్రమాలు చోటు చేసుకుంటున్నా అధికారులు మౌనం దాల్చడం వెనుక ఆంతర్యమేమిటని అడ్డాకుల మండల ప్రజలు ప్రశ్నిస్తు న్నారు. స్థానిక అవసరాలకు అవసరమైన ఇసుక తరలింపుకు ప్రభు త్వం అనుమతులు ఇచ్చింది. ఇదే అదునుగా చూసుకున్న ప్రజా ప్రతిని ధులు, అధికారులు, నాయకులు ఇసుక మాఫియాతో చేతులు కలిపి అడ్డగోలుగా ఇసుక అక్రమ రవాణా మండల పరిధిలోని కందూరు వాగు నుంచి జోరుగా సాగుతోంది. ఇసుకను తర లించేందుకు అనుమతులు ఇవ్వడంతో వారానికి ఆ రెండు రోజులు అధికారికంగా ప్రభుత్వానికి కాకీ లెక్కలతో సరిపెడుతూ వస్తున్నారు.వాస్తవానికి రెండు రోజుల్లో కనీసం 800 ట్రాక్టర్ల ట్రిప్పులు ఇసుకను ఇక్కడి నుండి తరలిస్తున్నారు. 


 అడ్డూ, అదుపు లేని ఇసుక మాఫియా

అధికారికంగా ఒక్కొ ట్రాక్టర్ ట్రిప్పుకు రూ.600 చెల్లించాలి. అక్రమంగా మరో రూ.400 నుండి రూ.600 వరకు వివిధ పార్టీలకు చెందిన నాయకులు వసూళ్లు చేస్తున్నారు. దీం తో రూ.4 లక్షలకు పైగా అక్రమార్జన సంపాధించుకుంటున్న విషయం అధికారులు, అనధికారులకు తెలిసినప్పటికీ అక్రమ వసూళ్లలో అధికా రులు జోక్యం చేసుకోవడం లేదంటే వారి కనుసన్నలతోనే ఈ తతంగం నడుస్తుందని పుకార్లు వినపడుతున్నాయి. కందరూ గ్రామానికి చెందిన అన్ని పార్టీల నాయకులు ఏకమై ఇసుక తరలింపు చేస్తున్నారు. ఇసుక డంప్పింగ్ దగ్గర ఉండి అక్రమంగా రూపాయలు వసూలు చేయాలని నిబంధనలను పెట్టుకొని వచ్చిన కాడికి దండుకుంటున్నారు. ఇలా చేయడం వల్ల నష్టపోయేది లబ్ధిదారులేనని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.స్థానిక అవసరాల నిమిత్తం ప్రభుత్వం ఇసుక అనుమతులను వాగులో మీటర్ లోతు ఇసుకను తీయాలనే నిబంధనలతో ఆదేశాలు జారీ చేసినప్పటికి కందూరు వాగులో మాత్రం 3 మీటర్ల లోతుపైనే ఇసుకను తీయటం పట్ల భూ గర్భ జలాలు అడుగంటి పోతాయని, చుట్టూ ఉన్న వ్యవసాయ దారులు వాపోతున్నారు.కందూరు పెద్ద వాగు నుంచి అడ్డగోలుగా ఇసుక అక్రమ రవాణాతో పాటు అక్రమ వసూళ్లు చేస్తున్నారని అధికారులు పర్యవేక్షణ కొరవడింది.

No comments:
Write comments