భానుడి భగభగ

 

హైద్రాబాద్, ఏప్రిల్ 8, (globelmedianews.com)
రోజురోజుకూ భానుడి భగభగ పెరిగిపోతోంది. తెలుగు రాష్ట్రాలు నిప్పులు కొలిమిలా మారుతున్నాయి. ముఖ్యమైన పని ఉంటే తప్ప.. ప్రజలు మధ్యాహ్నం బయటకు వెళ్లడం లేదు. మండుతున్న ఎండలు శరీరాన్ని డీహైడ్రేషన్‌ (నిర్జలీకరణ)కు గురిచేస్తాయి. దీనివల్ల శరీరం అదుపుతప్పి అనారోగ్యానికి దారి తీస్తుంది. ఈ సీజన్‌లో ఎండలో బయట తిరిగేవారు వడదెబ్బకు గురవుతుంటారు. కొన్ని సందర్భాలలో కోమాలోకి వెళ్లే అవకాశాలున్నాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. రాజస్థాన్, ఉత్తర్‌ప్రదేశ్ నుంచి వచ్చే వడ గాలులు ఏపీపై తీవ్ర ప్రభావం చూపుతాయని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు. తెలంగాణలో సైతం అన్ని జిల్లాల్లోనూ ఎండలు మండిపోతున్నాయి. గత ఏడాదితో పోల్చితే రాత్రిపూట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 డిగ్రీల మేర పెరిగే అవకాశం ఉందని వాతావారణశాఖ ఇటీవల తెలిపింది. మార్చి నెలలోనే 40 డిగ్రీల ఉష్టోగ్రత నమోదు కావడం ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. జూన్ రెండో వారం వరకు వేడి గాలుల ప్రభావం ఉంటుంది. 
వడ‘దెబ్బ’ కొడుతుంది.. 


భానుడి భగభగ 

సాధారణ గరిష్ట ఉష్ణోగ్రతలకు మించి వాతావరణం వేడెక్కి వేడి గాలులు రావడాన్ని వడగాలులు అంటారని తెలిసిందే. వడగాలి ఆరోగ్యంపై ప్రభావం చూపుతోంది. వేడి తిమ్మిర్లు (హీట్‌ క్రాంప్‌) వస్తాయి. దీంతో నీరసం, సత్తువ తగ్గడం, కళ్లు తిరగడం, తలనొప్పి రావడం, వాంతులు కావడం జరుగుతాయి. వేసవి మనపై ఎలాంటి ప్రభావం చూపుతుంది, వడగాలుల నుంచి ఎలా రక్షించుకోవాలి, ఏ పనులు చేయకూడదో ఆ వివరాలు మీ కోసం... 
నీళ్లు, మజ్జిగ అధికంగా తీసుకోవాలి.. వేసవికాలం నేపథ్యంలో రోజూ సాధ్యమైనన్ని నీళ్లు తాగడం మాత్రమే కాకుండా, చల్లటి మజ్జిగ తీసుకోవడం ఉత్తమం. వేళకు ఆహారం, పండ్ల రసాలు లాంటివి తీసుకుంటే ఎండల నుంచి కాస్తయినా ఉపశమనం లభిస్తుంది. మామిడికాయ తింటే సోడియం క్లోరైడ్, ఐరన్‌లను కోల్పోకుండా, డీ హైడ్రేషన్‌న్‌కు గురి కాకుండా చేస్తుంది. విటమిన్ సి ఎక్కువ ఉండే ఆరెంజ్ పండ్లు రోగనిరోధ శక్తిని పెంచుతాయి. కొబ్బరి నీళ్లు తాగితే ఖనిజ లవణాలు, ఎలక్ట్రోలైట్స్ లభించి మండు వేసవిలో అది మనకు ఔషదంలా పని చేస్తుంది

No comments:
Write comments