త్యాగాలు ప్రజాలవి.. భోగాలు కేసీఆర్ కుటుంబానివి

 

ప్రశ్నించే గొంతు ఉండకూడదనే ఎమ్మెల్యేల కొనుగోలు
 ఇంటర్ విద్యార్థుల జీవితం అగమ్య గోచరం చేసిన ప్రభుత్వం ఇది
 ప్రజాస్వామ్యం.. రాజ్యంగం ప్రమాదంలో పడ్డాయి
ఏడూళ్ల బయ్యారం, ఏప్రిల్ 29 (globelmedianews.com)
సామాజిక, ప్రత్యేక తెలంగాణ కోసం సామాన్య ప్రజలు త్యాగాలు చేస్తే భోగాలు మాత్రం కేసీఆర్ కుటుంబం అనుభవిస్తోంది సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు.  ప్రజా పరిరక్షణ యాత్ర రెండోరోజులో భాగంగా ఆయన పినపాక నియోజకవర్గం ఏడూళ్ల బయ్యారంలో భట్టి విక్రమార్క పర్యటించారు. భట్టితో ఓటు భద్రాచలం ఎమ్మెల్యే పొడెం వీరయ్య ఈ యాత్రలో పాల్గొన్నారు.  ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం, రాజ్యాంగం ప్రమాదంలో పడ్డాయని అన్నారు. ప్రభుత్వం చేసిన అవినీతిని మొదటి సమావేశంలోనే గణాంకాలతో సహా ప్రశ్నించినందుకు  భయపడ్డ ముఖ్యమంత్రి కేసీఆర్  ప్రతిపక్షం లేకుండా చేసే కుట్రకు తెర లేపారని అన్నారు. 

త్యాగాలు ప్రజాలవి.. భోగాలు కేసీఆర్ కుటుంబానివి

ప్రశ్నించే గొంతును నొక్కితే  ఆడిగేవాళ్ళు ఎవరూ ఉండరన్న ఆలోచనతో కుట్రకు తెర లేపరని అన్నారు. ఎమ్మెల్యేలు లేకపోతే కాంగ్రెస్ పార్టీకి నష్టం లేదని.. వచ్చే ప్రమాదం అంత ప్రజాలకేనని భట్టి అన్నారు.ప్రశ్నించే వ్యవస్థ లేకపోతే  ప్రజాస్వామ్య మనుగడ ఉండదని.. అప్పుడు నియంత పాలన ఏర్పడుతుందని భట్టి అన్నారు. చేతగాని ప్రభుత్వం ఇంటర్ విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటోందని అన్నారు. గతకాంగ్రెస్ ప్రభుత్వాలు విద్యార్థులు, నిరుద్యోగుల విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండేవని అన్నారు. సామాజిక తెలంగాణ కోరుతూ సామాన్య ప్రజలు, దళిత , గిరిజన, బహుజన, బడుగు, బలహీన వర్గాలు ప్రజలు త్యాగాలు చేస్తే రాష్ట్రం వచ్చాక  కేసీఆర్ కుటుంబం మాత్రం భోగాలను అనుభవిస్తోందని అన్నారు. ప్రాజెక్టుల రీ డిజైన్ పేరుతో కోట్ల రూపాయల అవినీతికి పాల్పడి  ఆ సొమ్ముతో ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారని అన్నారు.ఒక పార్టీ గుర్తుపై వెలిచి పార్టీ మరిన నాయకులు మోసగాళ్ళు అని భట్టి తీవ్ర పదజాలంతో అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన బీ ఫామ్ తో  ఎన్నికల్లో పోటీ చేసి నేను కాంగ్రెస్ వాదిని అని చెప్పు ప్రజల వద్ద ఓట్లు వేయించుకుని  పార్టీ మారిన వారిని మోసగాళ్ళు అనికాక ఏమని పిలవాలని ప్రజలను ఉద్దేశించి భట్టి ప్రశ్నించారు. 

No comments:
Write comments