భారీ వర్షంతో అతలాకుతలం

 

కూలిన చెట్లు, తెగిపడిన విద్యుత్ వైర్లు
తడిసి ముద్దైన వరి ధాన్యం
రైతుల రాస్తారోకో, ధర్నా
వనపర్తి ఏప్రిల్ 23 (globelmedianews.com)
అన్నదాతల ఆశలు ఆవిరైంది. వ్యయ ప్రయాసాలకోర్చుకుని వరి పంట పండించిన రైతు ధాన్యం అమ్ముకోలేని ధైన్య స్థితికి వెళ్ళాడు. వనపర్తి  జిల్లా ఆత్మకూర్ లోసోమవారం  సాయంత్రం బలమైన ఈదురు గాలులతో కురిసిన భారీ వర్షం అతలాకుతలం చేసింది. సుమారు గంట పాటు కురిసిన వానకు జనజీవనం స్తంభించిపోయింది. ప్రధాన రహదారులు జలమయమైంది. 


భారీ వర్షంతో అతలాకుతలం

చెట్లు, కొమ్మలు కూలిపోగా విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. దీంతో రెండు గంటల పాటు విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. మండలంలోని పలు గ్రామాలలోని మామిడి నేలకొరిగింది. ఆదివారం  మార్కెట్ యార్డులో ప్రారంభించిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతులు ఆరబోసిన వరి  ధాన్యం పూర్తిగా తడిసి ముద్దైంది. దీంతో రైతులు అమరచింద ప్రధాన రహదారిపై ధర్నా, రాస్తారోకో చేశారు.
కళ్ళెదురుగానే జోరువానలో ధాన్యం కొట్టుకుపోతుంటే నిస్సహాయత స్థితిలో కంటతడిపెట్టాడు. అసహనానికి గురైన రైతన్న భాధ, ఆవేదనను దిగమింగుతూ రోడ్డక్కి రాస్తారోకో, ధర్నా చేశారు. తడిసిన ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేసారు.

No comments:
Write comments