ఉగ్రవాద సానుభూతి పరులను ఎప్పటికప్పుడు ఏరివేయాలి

 

ఎంపి మాజీ కేంద్ర మంత్రి  బండారు దత్తాత్రేయ 
హైదరాబాద్ ఏప్రిల్ 26 (globelmedianews.com),
ఇటీవల శ్రీ లంక లో ఇస్లామిక్ తీవ్రవాద బాంబు పేలుళ్లలో ప్రాణాలు   కోల్పోయిన హైదరాబాద్ లోని ఎల్లారెడ్డిగూడ  వాసి  వేమూరి తులసీరామ్ యొక్క కుటుంబ సభ్యులను ఎంపి మాజీ కేంద్ర మంత్రి  బండారు దత్తాత్రేయ  వారి నివాసంలో పరామర్శించారు.అనంతరం పత్రికా ప్రతినిధులనుద్దేశించి మాట్లాడుతూ:  పవిత్రమైన ఈస్టర్ ఆదివారం రోజున శ్రీ లంక లో  ఇస్లామిక్ తీవ్రవాద శక్తులు జరిపిన బాంబు దాడులు ప్రపంచాన్నంతటిని తీవ్రా దిగ్రాంతి కి గురిచేసిందని అన్నారు. హైదరాబాద్ లోని ఎల్లారెడ్డిగూడ నివాసి  వేమూరి తులసీరామ్ తన మిత్రులతో కలిసి సరదాగా విహారయాత్రకు వెళ్లి ఈ బాంబు దాడుల్లో ప్రాణాలు కోల్పోవడం బాధాకరం,దురదృష్టకరమనిపేర్కొన్నారు.  వారి తల్లి  నళిని  ఏకైక  కుమారుడు  తులసీరామ్ ప్రాణాలు కోల్పోవడం తో ఆమె తీవ్ర శోక సముద్రంలో మునిగిపోయిందని, ఆమెను ఓదార్చడం ఎవ్వరి వల్ల కావడం లేదని అన్నారు. వారి కుటుంబ సభ్యులకు తన తీవ్ర సంతాపాన్ని తెలియజేశానని తెలిపారు.


ఉగ్రవాద సానుభూతి పరులను ఎప్పటికప్పుడు ఏరివేయాలి

ఇస్లామిక్ తీవ్రవాదం ప్రపంచ మనుగడకే పెను ముప్పుగా మారిందని,  ఇది కేవలం ఒక మతానికో లేక ఒక కులానికో పరిమితం కాలేదని అన్నారు.  ఈ విషయాన్ని రాజకీయం చేయకుండా ప్రతి ఒక్కరు ఖండించాల్సిందిగా కోరారు.  తీవ్రవాదాన్ని అరికట్టేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చేపట్టిన చర్యలకు ప్రతి ఒక్కరు సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.మరొక వైపు మన రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరం ఇస్లామిక్ తీవ్రవాదులకు అడ్డా గా మారిందని, ఇస్లామిక్ తీవ్రవాదులకు హైదరాబాద్ ఒక భూతాల స్వర్గం గా మారిందని పేర్కొన్నారు.  ఒక అంతర్జాతీయ సంస్థ నివేదిక ప్రకారం ఐఎస్ఐఎస్ (ఇస్లామిక్ తీవ్రవాదుల) పట్ల ఆకర్షితులవుతున్న వారిలో భారత్, పాకిస్తాన్ మరియు ఆఫ్గనిస్తాన్ దేశాలు అత్యధిక సంఖ్యలో ఉండగా, భారత దేశం నుండి ఆకర్షితులవుతున్న వారిలో ఎక్కువ మంది మూలాలు హైదరాబాద్ నగరం తో ముడిపడి ఉండడం భయాందోళనను కలిగిస్తుందని అన్నారు.  హైదరాబాద్ లోని కొందరు శక్తులు వారి స్వార్ధ రాజకీయాలకోసం అమాయక యువతను తీవ్రవాదం వైపు మళ్లేలా ప్రోత్సహిస్తున్నారని పేర్కొన్నారు.తెలంగాణ ముఖ్యమంత్రి ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించి డిజిపి స్థాయి అధికారి నేతృత్వంలో ఒక ప్రత్యేక "సిట్" ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటుచేసి హైదరాబాద్ నాగారాన్నే కాక నల్గొండ, మహబూబ్ నగర్, నిజామాబాద్ మరియు కరీంనగర్ తదితర ప్రాంతాల్లోని ఉగ్రవాద సానుభూతి పరులను మరియు వారి మూలాల్ని ఎప్పటికప్పుడు జాతీయ దర్యాప్తు సంస్థ సహకారంతో ఏరివేయాలని ఈ సందర్భంగా కోరారు.పొద్దస్తమానం మజ్లీస్ అధినేత, హైదరాబాద్ పార్లమెంట్ సభ్యులు అసదుద్దీన్ ఒవైసి ప్రసార మాధ్యమాల్లో బిజెపి మరియు ప్రధాని నరేంద్ర మోడీ గారిపై అసత్య ఆరోపణలు చేస్తూ  పబ్బం గడుపుతారే తప్ప ప్రపంచమంతా దిగ్బరాన్తి కి  లోనైనా  ఇంత తీవ్ర సంఘటన పట్ల విచారం వ్యక్తం చేయక పోవడమే గాక ఐఎస్ఐ తీవ్రవాదులను పల్లెత్తు మాటనకపోవడం ప్రజలందరూ గమనించాల్సిన విషయమని ఈ సందర్భంగా పేర్కొన్నారు.  

No comments:
Write comments