రైతుల కష్టాలు తెలుసు : బాబు

 

విజయవాడ, ఏప్రిల్ 5, (globelmedianews.com)
తాను వ్యవసాయం చేశాననీ, రైతన్నల కష్టాలు తనకు తెలుసని ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తెలిపారు. అందుకే రూ.24,500 కోట్ల మేర రైతు రుణాలను మాఫీ చేశామన్నారు. ఈ రుణమాఫీకి సంబంధించి నాలుగు, ఐదో విడత బకాయిలను ఎన్నికలకు ముందే ఇస్తున్నామని పేర్కొన్నారు.అలాగే అన్నదాతా సుఖీభవ పథకం కింద 2 హెక్టార్లు ఉంటే రూ.9,000, అంతకంటే ఎక్కువ భూమి ఉంటే రూ.10 వేలు అందజేస్తున్నామని చెప్పారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చాలన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని చంద్రబాబు తెలిపారు. 


రైతుల కష్టాలు తెలుసు : బాబు

తాను రైతులకు పెద్దన్నగా ఉండాలనుకుంటున్నాననీ, కాబట్టి రైతులందరూ టీడీపీకి ఓటేసి బలపరచాలని కోరారు.పెద్దల కష్టాలు తెలుసు కాబట్టే వృద్ధాప్య పెన్షన్లను రూ.200 నుంచి రూ.వెయ్యికి, ఆ తర్వాత రూ.2,000కు పెంచానని తెలిపారు. పేదల సొంతింటి కల నెరవేర్చాలన్న ఉద్దేశ్యంతో రూ.80,000 కోట్లతో 29 లక్షల ఇళ్లను నిర్మిస్తున్నామని చంద్రబాబు వెల్లడించారు. వీటిలో 11 లక్షల ఇళ్ల నిర్మాణాన్నిఇప్పటికే పూర్తిచేసి లబ్ధిదారులకు అందించామన్నారు. ఈ మేరకు చంద్రబాబు ట్విట్టర్ లో పలు వీడియోలను పోస్ట్ చేశారు

No comments:
Write comments