భద్రకాళీ ఆలయంలో ముగిసిన మహోత్సవాలు

 

వరంగల్, ఏప్రిల్, 13 (globelmedianews.com):
వరంగల్ మహానగరంలో భూతల మణిద్వీపంగా విరాజిల్లుతున్న శ్రీ భద్రకాళీ దేవస్ధానంలో ఎంతో వైభవంగా జరుపబడుతున్న వసంత నవరాత్ర మహోత్సవములు శనివారం పూర్ణాహుతిలో ముగిసాయి. ఉదయం అమ్మవారికి లక్ష పుష్కార్చన పసుపు రంగు చాంమతి పూలతో నిర్వహింపబడింది. ఈ కిర్యక్రమాన్ని ప్రధానార్చకులు శ్రీ భద్రకాళి శేషు ఆధ్వర్యంమేన వేదపండితులు  పాలకుర్తి నర్సింహమూర్తి, ముఖ్య అర్చకులు  చెప్పెల వెంకటనాగరాజు శర్శ, పఖ్యాత గణపతి ఉపాసకులు  రాపాక అరవింద్  శర్మ ,వేద పాఠశీల విద్యార్దులు నిర్వహించారు.  


 భద్రకాళీ ఆలయంలో ముగిసిన మహోత్సవాలు

లక్షపుష్పార్చన ఉభయదాతలు కరీంనగర్ వాస్తవ్యులు  తొనుపునూరి మల్లేశం-సులోచన దంపతులు , శ్రీ పుల్లూరు రమేష్-సూజాత దంపతులు  చామంతి పూలతో అమ్మవారికి పుష్పార్చన జరిపించారు.  వైదికాగమ అనుయాయులందరికి సంప్రదాయ రీత్యా ఈ రోజే శ్రీ రామ నవమి.  కావున  సాయంత్రం గం7-00 లకు మహామంబపంలో శ్రీ సీతారామ  కాళ్యాణం  కన్నుల పండుగగా అత్యంత వైభవోపేతంగా నిర్వహింపబడింది. ఆలయ ఈ.ఓ ఆర్.సునీత వసంత నవరాత్ర ఉత్సవాలు విజయవంతం కావడానికి సహకరించిన భక్తులు, అధికార ,అనధికార ప్రముఖులు ప్రధానంగా ప్రింట్ , ఎలక్ట్రానిక్  మీడియా ప్రతినిధులందరికీ పేరుపేరున కృతజ్ఞతలు తెలుపడంతో ఈ సంవత్సరం  వసంత  నవరాత్రులు సుసంపన్నమయ్యాయి. ఈ సంవత్సరం వైశాఖ మాసం అనగా మే 6వ తేదీ నుండి 10 రోజుల పాటు అమ్మవారికి జరిగే బ్రహ్మోత్సవాలలో కూడా పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని శేషు , ఈ.ఓ ఆర్.సునీత భక్తులను కోరారు.

No comments:
Write comments