బిజెపి లో చేరిన రాపోలు ఆనంద భాస్కర్

 

హైదరాబాద్ ఏప్రిల్ 4 (globelmedianews.com)
రాజ్య సభ మాజీ సభుడు రాపోలు ఆనంద భాస్కర్ గురువారం న్యూ ఢిల్లీ లో కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ సమక్షం లో భారతీయ జనత పార్టీ లో చేరారు.ఈ సందర్బంగా ఆయన మీడియా తో మాట్లాడుతూ దేశం లో సమూలమైన అభివృద్ధి సాధన ఒక్క భారతీయ జనతా పార్టీ నాయకత్వం లోనే జరుగుతుందని, అందుకే తాను కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ఆ పార్టీ లో చేరినట్లు తెలిపారు. దేశ సమగాతను కాపాడటం తో పాటు ప్రాంతీయ సమతుల్యతను సాదించడం కేంద్రం లోని బిజేపి కి మాత్రమేసాధ్యమని, దేనిలో బాగంగానే తెలంగాణా రాష్ట్ర సమగ్రాభి వృద్ధికి ఆ పార్టీ చర్యలు చేపట్టిందని ఆయన అన్నారు.


బిజెపి లో చేరిన రాపోలు ఆనంద భాస్కర్

కాంగ్రెస్ పార్టీ లో 25 సంవస్సరాలు ఒక సైనికుడి మాదిరిగా పని చేసానని,ప్రస్తుతం ఆ పార్టీ అనుసరిస్తున్న విదానాలు మహాత్మా గాంధీ ఆశయాకు సిద్దాంతాలకు విరుద్దంగా ఉందని అందువల్లే మార్చి 22 వ తేదిన ఆపార్టీకి రాజీనామా చేయాలన్న నిర్ణయాన్ని తెసుకున్ననన్నారు.ఈ సందర్బంగా కాంగ్రెస్ పార్టీ కి రాజి నామా చేస్తూ బిజెపిలో చేరడానికి కారణాలు వివరిస్తూ ఆయన బహిరంగ లేఖ రాసారు.జాతెయ సమగ్రత ,ఉగ్రవాదులనుండి దేశాన్ని పరిరక్షించడం వంటి చర్యలు ప్రదాని నరేంద్ర మోడీ నాయకత్వం లోని బిజెపి వల్ల సాధ్యమని పేర్కొన్నారు. వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి చేనేత కార్మికుల సంక్షేమానికి  ఆ పార్టీ విశేశంగా కృషి చేస్తుందని ఆనంద భాస్కర్ పేర్కొన్నారు.

No comments:
Write comments