తెలంగాణ ఇండస్ట్రీయల్ హెల్త్ క్లీనిక్‌ పని ప్రారంభం

 

హైద్రాబాద్, ఏప్రిల్ 30, (globelmedianews.com)
సిటీలో ఖాయిలా పడ్డ సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలను తిరిగి పునరుద్ధరించేందుకు కసరత్తు చేస్తున్నారు. ఇందుకోసం సమీక్షా సమావేశాలకు జిల్లా అధికారులు శ్రీకారం చుట్టారు.  పారిశ్రామికవేత్తలుగా రంగప్రవేశం చేస్తున్నారు. ఔత్సాహికులకు సమర్థ్యాన్ని బట్టి బ్యాంకులు రుణాలిస్తున్నాయి. హైదరాబాద్‌లో భారీ పరిశ్రమల ఏర్పాటు చేయడానికి ఆస్కారం లేదు. కేవలం సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలను మాత్రమే ఏర్పాటు చేసుకునే వీలుంది. ఇలాంటి పరిశ్రమలే జిల్లాలో అధికంగా ఏర్పాటయ్యాయి. రుణాలు పొందిన తర్వాత ఉత్పాదక, మార్కెటింగ్‌తో ఆయా పరిశ్రమలు చిక్కుల్లో పడుతున్నాయి. 


తెలంగాణ ఇండస్ట్రీయల్ హెల్త్ క్లీనిక్‌ పని ప్రారంభం

బ్యాంక్ వాయిదాలు, వడ్డీలు కట్టలేకపోతున్నారు. వీటికి ప్రోత్సాహాన్ని అందిస్తే తిరిగి నిలదొక్కుకునే అవకాశాలున్నాయి. పరిశ్రమల మంత్రిత్వశాఖ ఆదేశాలతో పరిశ్రమలకు జీవం పోసేందుకు జిల్లా అధికారులు సమాయత్తమవుతున్నారు. ఖాయిలా పడ్డ పరిశ్రమలకు తిరిగి పూర్వవైభవం తీసుకొచ్చేందుకు రాష్ట్రస్థాయిలో తెలంగాణ ఇండస్ట్రీయల్ హెల్త్ క్లీనిక్‌ను ఇటీవలే ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ హెల్త్ క్లీనిక్ ద్వారా పరిశ్రమలు తిరిగి నిలదొక్కుకునేలా ప్రోత్సహిస్తున్నారు. హైదరాబాద్‌లోని కొన్ని ఎంఎస్‌ఎంఈ పరిశ్రమలు సైతం నష్టాలతో ఇబ్బందులు పడుతున్నాయి. ఇందుకోసం జిల్లా స్థాయిలో ఉన్నతాధికారులు బ్యాంకింగ్ అధికారులతో కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీ ప్రతీ నెలా సమావేశమై సమీక్ష నిర్వహించాల్సి ఉంది. ఖాయిలా పడ్డ ఎంఎస్‌ఎంఈ పరిశ్రమలపై సమీక్ష నిర్వహించడం కోసం జిల్లా అధికారులతో కూడిన కమిటీ సమావేశమైంది. ఇప్పటికే జిల్లాలో ఎన్ని యూనిట్లు ఖాయిలా పడ్డాయో, రుణాలు, వాయిదాలు, వడ్డీలు చెల్లించకుండా ఉన్నాయో.. ఆయా వివరాలను సేకరించారు. వాటి్కి జవసత్వాలు కల్గించే పని ప్రారంభించనున్నారు. 

No comments:
Write comments