టీడీపీ గుండాల దగ్గర మహిళల వ్యక్తిగత సమాచారం

 

హైద్రాబాద్  ఏప్రిల్ 30 (globelmedianews.com)
డేటా చోరీ వల్ల తెలుగురాష్ర్టాల కుటుంబాల భవిష్యత్తు ప్రమాదంలో పడింది. ప్రతి కుటుంబంలోని ప్రతి ఒక్కరికి సంభందించిన డేటాను టిడిపి,చంద్రబాబు కలసి దొంగిలించారు. రాష్ర్టంలోని ప్రతి కుటుంబంలోని మహిళల సమాచారం టిడిపి గూండాల వద్ద ఉంది. ఆడపిల్లల ఫోన్ నెంబర్లు,ఆధార్ కార్డులు,వివాహితులా అవివాహితులా,బ్యాంక్ అకౌంట్ వివరాలు దొంగల ముఠా వద్ద ఉన్నాయని వైకాపా నేత, ఎంపీ విజయసాయి రెడ్డి అన్నారు. ఈ డేటా అంతా కూడా ఆధార్ కార్డు డేటాలో ఈ ప్రగతి అనే ఏపి ప్రభుత్వం డెవలప్ చేసిన యాప్ లో ఉంది. జే సత్యన్నారాయణ ఉడాయ్ ఛైర్మన్ గా ఎంపికైననాటినుంచి ఆధార్ డేటాను ఈ ప్రగతికి లింక్ చేశారు. సంక్షేమపధకాలకు ఆధార్ లింక్ చేసే మిషతో ఇలా చేశారు. ఫింగర్ ప్రింట్స్ రెటీనా ఉంటుంది.ఇదంతా ఈ ప్రగతికి ట్రాన్స్ ఫర్ చేశారు. క్యారెక్టర్ ఐడెంటిఫికేషన్ సాఫ్ట్ వేర్ ను డేటా కింద కన్వర్ట్ చేశారు. ఆధార్ డేటాను అంతా కూడా ఈ ప్రగతి నుంచి సేవామిత్రకు బదిలీ చేశారు.  ఈ ప్రగతి ఏపి ప్రభుత్వంది. అయితే సేవామిత్ర అనేది టిడిపికి సంభందించింది. సేవామిత్ర నుంచి డేటా బేస్ కు వచ్చింది.డేటాబేస్ నుంచి ఎనీ వన్ కెన్ రిజిష్టర్ టిడిపి వరకు వచ్చింది. ఈ డేటా ఆరుకోట్ల ప్రజలందరికి సంభందించిన వివరాలు.


టీడీపీ గుండాల దగ్గర మహిళల వ్యక్తిగత సమాచారం 

ఆడపిల్లల వివరాలు చంద్రబాబు తన యాప్ లో పెట్టుకున్నారు. -దీనిపై విచారణ జరగాలని అయన డిమాండ్ చేసారు. సేవామిత్ర అనేది ఐటిగ్రిడ్ డెవలప్ చేసింది. ఐటి గ్రిడ్స్ ఓనర్ అశోక్ దాకవరం. ఆశోక్ ను పట్టుకునేందుకు తెలంగాణా ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది. అశోక్ సేకరించిన సమాచారం ద్వారా ఎవరు ఎక్కడెక్కెడ ఉన్నారో ట్రాక్ చేసే అవకాశం ఉంది. మీ బంధువుల స్నేహితుల ఫోన్ నెంబర్లు సేవామిత్రకు వెళ్తాయి. ఫోన్ స్టోరేజి డేటా కూడా వారి వద్దకు వెళ్లి పోతుంది.అవసరమైతే వారు డేటాను డిలీట్ కూడా వారు చేయవచ్చు. ఈ నెంబర్ ను ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందని ప్రశ్నించారు. సిమ్ కార్డు మార్చినా కూడా ఈ పన్లన్నీ కూడా చేసే అవకాశం ఉంటుంది. ఇలా చేయడం దేశానికి ముప్పు.మీ ఫోన్ లో మైక్రో ఫోన్ రికార్డింగ్. మీరు ఫోన్ లో మాట్లాడే మాటలు రికార్డ్ చేయవచ్చు. చంద్రబాబు అశోక్ ద్వారా దేశానికి రాష్ర్టానికి ప్రజలకు ఎంత ముప్పు తీసుకువచ్చారో అర్దం చేసుకోవచ్చు. మీ బ్యాంక్ అకౌంట్ వివరాలు గాని,ఆడపడుచుకు ప్రమాదం జరిగితే,ధ్రెటన్ చేయడం జరిగితే టిడిపి దొంగల పనే అని గమనించుకోవాలి. ఈ వివరాలు ఎలా సేకరించారో తెలుసుకుందామన్నారు.  ప్రభుత్వం సంక్షేమపధకాలు,డ్రైవింగ్ లైసెన్స్ ఏది కావాలన్నా ఆధార్ తప్పనిసరి. ఏపి ఆన్ లైన్ లో యధాతధంగా పంపించారు. ప్రతి కుటుంబంలో ఆడపిల్ల వయస్సు,ఆదాయం ఉద్యోగం,కీలక సమాచారం సేకరించి సేవామిత్ర అనే ప్రేవేట్ యాప్ లో ఎందుకు దాచవలసి వచ్చింది. సేవామిత్ర ద్వారా ఎవరికి సమాచారం అందుబాటులో ఉంటుందో తెలుసుకోవాలి. ప్రతి టిడిపి సభ్యుడికి ఈ మొత్తం సమాచారం అంతా అందుబాటులోకి ఉంటుంది. డేటాబేస్ ఆధారంగా ఎవరు ఎవరికి ఓటు వేశారో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. టిడిపిపై ఎవరైతే అసంతృప్తి వ్యక్తం చేశారో ఆ వ్యక్తుల ఓట్లను ఫారం 7 ద్వారా ఉపయోగించి తొలగించారు. మహిళలకు అభద్రతా భావం కల్పించారు. ఈ డేటా బేస్ ను పాకిస్తాన్ ,సిరియాకో ఇవ్వరు అనే నమ్మకం మాకు ఎక్కడ ఉంది. మీరు దుర్వినియోగం చేస్తారనే అంశాన్ని ప్రశ్నిస్తున్నా. చంద్రబాబు చేసిన నేరం ఇది. ఐటి మంత్రిగా ఉన్న నారాలోకేష్ ద్వారానే సమాచారం ఐటి గ్రిడ్ కు చేరింది అశోక్ దాకవరం చంద్రబాబుకు,లోకేష్ లకు బినామి. అతనిని అరెస్ట్ చేయకుండా వీరు అడ్డుపడుతున్నారు. ఎందుకు అశోక్ అజ్ఞాతంలోకి వెళ్ళాల్సివచ్చింది.ఎందుకు చంద్రబాబు,లోకేష్ లు రక్షిస్తున్నారు. డేటా స్కామ్ తర్వాత బాలసుబ్రమణ్యం గారి ఆద్వర్యంలో సిట్ వేశారని అన్నారు. బాలసుబ్రమణ్యంగారిని అడుగుతున్నా ఆ సిట్ దర్యాప్తు ఏమైంది అని అడుగుతున్నా. సిఎం డాష్ బోర్డు అనే పేరుతో చంద్రబాబు ప్రగల్బాలు పలుకుతూ ఫోజులుకొడుతుంటాడు. సిఎం డాష్ బోర్డు అనేది చంద్రబాబు అధికారంలోకి రాగానే రాలేదు. వైయస్సార్  హయాంలో కూడా ఉంది. వెర్షన్ -2 ను భారత రాష్ర్టపతితో ఓపెన్ చేయించారు. కొద్దిరోజులకే అది కొలాప్స్ అయిపోయింది. వైయస్సార్  హయాంలో ఉన్న డాష్ బోర్టునే వర్ష్ న్, బ్యానర్ మార్చి ఇప్పుడు వినియోగిస్తున్నారు.  సెంట్రల్ గవర్నెమెంట్ డేటాను స్టోర్ చేసుకోవడానికి ఇన్ ఫ్రాస్రక్చర్ ఫ్రోవైడ్  చేసింది. అలాంటి పరిస్దితి ఉన్నపుడు ఈ ప్రగతి అనేది దానిిని వాడకుండా వేరే డేటా సెంటర్ కు ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది. ఆ డేటా సెంటర్ సైతం చంద్రబాబు, లోకేష్ బినామిలకు ఇచ్చారు. జే సత్యన్నారాయణ అవినీతి పరుడు అని చెప్పడం లేదు.కాని చంద్రబాబుకు సహకరించేందుకు  ఆధార్ డేటాను దొంగిలించారని అభియోగం మోపుతున్నాం.ఇది క్రైమని అన్నారు. -ఎన్ బాలసుబ్రమణ్యం విషయానికి వద్దాం.ఆయన భార్యకు రెండు సంస్ధలు ఉన్నాయి గ్రీన్ ఆర్క్ సొల్యూషన్ ,ఓటిఎస్ ఐ అనేది వాటి పేర్లు .ఓటిఎస్ ఐ అనేది రవాణా శాఖకు సంభందించి యాప్ ను తయారుచేసింది. ఓటిఎస్ ఐ ఆఫీసియల్ టెక్నాలజీ భాగస్వాములు ఆర్టిఏకి . ఓటిఎస్ ఐకి టెండర్ ఇచ్చారు.దానిలో పారదర్శకత లేదు. అభయ అనే యాప్ ను మహిళ రక్షణకు ఇంట్రడ్యూస్ చేశారు.మహిళలు బటన్ నొక్కితే అలార్మ్ చేస్తుంది. విజయవాడ,విశాఖపట్నంలలో మాత్రమే లక్ష ఆటోలకు 188 కోట్లు వెచ్చించి ఓటిఎస్ ఐకి టెండర్ ఇచ్చారు. అభయ యాప్ ద్వారా ఎంతమంది మహిళల వద్దనుంచి ఫిర్యాదులు వచ్చాయి. ఎన్ని అత్యాచారాలను ఆపగలిగారు బయటకు వెల్లడించండి. ఆధార్ డేటా బేస్ ను ఉపయోగించుకుని జగన్ గారి నియోజకవర్గంలో(పులివెందుల) సమాచారాన్ని  ఎలా సేకరించారో ఇట్టే తెలిసిపోతుంది. ఆడపిల్లల జీవితాలతో టిడిపి,టిడిపి కార్యకర్తలు ఆడుకుంటున్నారు.దేశభధ్రతకే ముప్పు తెస్తున్నారు ఈడేటాను టెర్రరిస్టులకు విక్రయించే అవకాశం ఉందని అయన అన్నారు.

No comments:
Write comments