తీరప్రాంత రక్షణకు మరో కొత్త నౌక

 

విశాఖపట్నం, ఏప్రిల్ 15  (globelmedianews.com)
శక్తి వంతమైన తీర గస్తీ నౌక వీర ఇండియన్ కోస్ట్ గార్డ్  దళంలో ప్రవేశించింది. సోమవారం విశాఖ నావెల్ డాక్ యార్డ్ లో  వీర తీర ప్రాంత గస్తీ నౌక దళంలో ప్రవేశించే వేడుకలో  ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమం లో విశిష్ట అతిథులుగా  కోస్ట్ గార్డ్ డిజి  జనరల్ రాజేంద్ర సింగ్, తూర్పు కోస్తా నావికాదళాధిపతి వైస్ అడ్మిరల్ కరంభిర్ సింగ్ లు పాల్గొన్నారు. 


తీరప్రాంత రక్షణకు మరో కొత్త నౌక

ఇండియన్ కోస్ట్ గార్డ్ తీర గస్తీ నౌక వీర 98 మీటర్లు పోడవు ఉంటుంది. ఆధునాతన నావిగేషన్, ర మ్యూనికేషన్స్ వ్యవస్థ తో పాటు ఆటోమేటిక్  హై పవర్ మేనేజ్మెంట్ వ్యవస్థఈ నౌక సొంతం.  ఒక హెలికాప్టర్ తో పా, నాలుగు స్పీడ్ బోట్లు ఈ "వీర" నౌక పై కొలువు తీరి ఉంటాయి. మొత్తం 12 మంది అధికారులు,  94 మంది సిబ్బంది తో కలిపి 116 మంది ఈ నౌక లో విధులు నిర్వహిస్తారు. దీనితో విశాఖ కోస్ట్ గార్డ్ దళంలో మరో శక్తి వంతమైన నౌక కొలువు దీరినట్లయింది.  నేవీ,  కోస్ట్ గార్డ్ సంయుక్తంగా తీర ప్రాంత రక్షణ లో విశేష సేవలు అందిస్తున్నాయాని చీఫ్ ఆఫ్ ఆర్మీ జనరల్ బిపిన్ రావత్ అభినందించారు. 

No comments:
Write comments