రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి గాయాలు

 

యాదాద్రి, ఏప్రిల్ 15  (globelmedianews.com)
యాదగిరిగుట్ట మండలం వంగపల్లి హైదరాబాద్ వరంగల్ జాతీయ రహదారిపై సోమవారం రోడ్డు ప్రమాదం జిరగింది. ఒక  ఆర్టీసీ బస్ ఎదురుగా వస్తున్న  ఒమిని కారుని ఢీకొట్టింది. దాంతో కారు  రోడ్డు పక్కన ఉన్న చిన్న వాగులోకి దూసుకుపోయింది.  రెండు సార్లు పల్టీ కొట్టింది. ఘటన సమయంలో  కారు లో ముగ్గురు ఉపేంద్ర, సంతోష్, సంధ్య వీరితో పాటు 20 రోజుల చిన్నారి ప్రయాణిస్తున్నారు.  ఆర్టీసీ డ్రైవర్ నిర్లక్ష్యంగా బస్ నడపుతుండడంతో ఈ ప్రమాదం జరిగింది అని బస్సు  ప్రయాణికులు తెలిపారు. 


రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి గాయాలు

అంతకుముందు ఆర్టీసీ బస్ హైదరాబాద్ నుండి భూపాలపల్లి కి వస్తుండగా ఉప్పల్ వద్ద మరో కారు ని ఢీకొనడంతో బస్ ని ప్రక్కన నిలపమని ప్రయాణికులు డ్రైవర్ ని అడిగారు. వద్దు  వద్దు అంటూ నిర్లక్ష్యంగా డ్రైవ్ చేస్తు వంగపల్లి కి వచ్చేసరికి మరో కారు ని ఢీకొట్టాడని వారన్నారు. ఘటన లో  కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు కి గాయాలు కావడంతో  భువనగిరి ఏరియా ఆసుపత్రికి తరలించారు.  చిన్నారి తల్లి సంధ్య తలకి బలమయిన గాయం కావడంతో పరిస్థితి విషమంగా ఉంది.  వైద్యుల సూచన మేరకు  హైదరాబాద్  తరలించారు. ప్రమాదానికి కారణమైన ఆర్ టి సి బస్ డ్రైవర్ పారిపోయాడు .

No comments:
Write comments