మహిళల భద్రతకు పెద్దపీట

 

వనపర్తి, ఏప్రిల్ 2  (globelmedianews.com)   
మహిళల భద్రత షీ టీమ్ లక్ష్యమని మహిళలు అన్ని రంగాల్లో రాణించి మహిళా శక్తి సాధికారత చాటుకోవాలి జిల్లా ఎస్పీ అపూర్వరావు అన్నారు. జిల్లాలోని మహిళలకు,విద్యార్థినిలకు  షీ టీం పై మరింత అవగాహన కల్పించేందుకు జిల్లా పోలీసుశాఖ ఆధ్వర్యంలో మంగళవారం జిల్లా కేంద్రంలోని స్థానికప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల మైదానం నుంచి 2కే నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని  జిల్లా కలెక్టర్ శ్వేత మహంతి,  జిల్లా ఎస్పీ అపూర్వరావు  జెండా ఊపి ప్రారంభిచారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రపంచ మహిళా దినోత్సవం మార్చి 8న చేయాల్సి ఉండగా పోలీసు దేహదారుఢ్య పరీక్షలు కొనసాగుతుండంతో ఈ రోజు ఘనంగా మహిళా సాధికారిత కార్యక్రమాన్ని నిర్వహించామని అన్నారు. జిల్లాలో మహిళలకు అత్యంత భద్రత కల్పిస్తున్నామని పేర్కొన్నారు,  షీ టీం బృందాలు నిరంతరం మహిళల రక్షణలో విధులు నిర్వహిస్తూఉంటాయని పేర్కొన్నారు,  మహిళల కోసం ప్రతి పోలీ స్టేషన్లో మహిళా పోలీసులతో ప్రత్యేక  రిసెప్షన్ కౌంటర్లు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.  


మహిళల భద్రతకు పెద్దపీట

మహిళలకు అత్యవసర సమయంలో ఆదుకునేందుకు, సమస్యలను పరిష్కరించడానికి పోలీసు యంత్రాంగం సిద్ధంగా ఉంటుందని సూచించారు, చాలా మంది మహిళలు తమకు జరిగిన అన్యాయాన్ని పోలీస్టేషన్ కి వచ్చి చెప్పుకోలేని స్థితిలో ఉన్నారని, అలాంటి వారికి షీ టీం అండగా ఉంటు రక్షణ కల్పించడం జరుగుతుంది అన్నారు. మహిళలు ఎప్పుడు ఏ సమస్య వచ్చినా  షీ టీంను సంప్రదించవచ్చు అన్నారు.  మహిళలకు షీ టీం పై అవగాహన కల్పించేందుకె ఈ 2కే  రన్ ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అనంతరం జిల్లా కలెక్టర్ శ్వేతమహంతి  మాట్లాడుతూ వనపర్తి జిల్లాలో అత్యధికంగా మహిళలే ఓటర్లు ఉన్నారని, నాగరుకర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గంలో మహిళలు అధిక సంఖ్యలో ఓటర్లుగా ఉండడంతో ఎన్నికల్లో నిర్ణేత శక్తిగా ఎదిగే అవకాశం కలిగిందన్నారు. రాబోయే  సార్వత్రిక ఎన్నికల పోలింగ్ రోజు తప్పనిసరిగా ఓటు హక్కును ప్రతి ఒక్కరు వినియోగించుకొవాలని సూచించారు, సమాజంలో మహిళలకు గొప్ప స్థానంఉందని, వారిని గౌరవించవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. శక్తిగా కీర్తించబడే స్త్రీమూర్తిని ఎట్టి  పరిస్థితిలో ఇబ్బందులకు గురి చేయరాదని అన్నారు.
విద్యార్తినిలు, యువతులు, మహిళలు ఇంకా ఇబ్బందులు ఎదుర్కొంటురని అలాంటివారికి మనోదైర్యం ఇచ్చేందుకు జిల్లా పోలీససు ఆధ్వర్యంలో షీ టీం బృందాలను ఏర్పాటు చేయడం   అభినదించ వలసిన విషయమని అన్నారు.  మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని, ప్రతి శాఖలో కీలక పాత్ర పోషిస్తున్నారని పేర్కొన్నారు, మహిళలు నిజాయితీ స్వభావం కలిగి ఉంటారని, చదువులో రాణించి సమాజంలో గుర్తింపు పొందాలని. ఆత్మహత్యలకుతకు గురికాకుండా ఆత్మస్థైర్యం తో ముందడుగు వేసి అన్నిరంగాల్లో రాణించాలని అన్నారు. 

No comments:
Write comments