వటపత్రశాయ అలంకారంలో శ్రీరామచంద్రమూర్తి తేజోవిలాసం

 

కడప,ఏప్రిల్ 15  (globelmedianews.com)
ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామస్వామివారి శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడో రోజు సోమవారం ఉదయం వటపత్రశాయ అలంకారంలో స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం 8.00 నుండి 10.00 గంటల వరకు స్వామివారి ఊరేగింపు వైభవంగా జరిగింది. భజన బృందాలు భజనలు, కోలాటాలు ఆడుతుండగా స్వామివారు పురవీధుల్లో విహరించారు. వాహనసేవ అనంతరం ఉదయం 11.00 నుండి 12.00 గంటల వరకు స్నపన తిరుమంజనం వేడుకగా జరిగింది. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనంతో శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరాములవారి ఉత్సవమూర్తులకు విశేషంగా అభిషేకం చేశారు. 


వటపత్రశాయ అలంకారంలో శ్రీరామచంద్రమూర్తి తేజోవిలాసం
సింహం పరాక్రమానికి, ధైర్యానికి, తేజస్సుకు, ఆధిపత్యానికి, మహాధ్వనికి సంకేతం. ఉదయం నిద్ర లేవగానే దర్శించే వస్తువుల్లో 'సింహదర్శనం' అతి ముఖ్యమయింది. సింహ రూప దర్శనంతో పైన పేర్కొన్న శక్తులన్నీ చైతన్యమవుతాయి. సోమరితనం నశించి పట్టుదలతో ప్రవర్తించి సర్వత్రా విజయులమై ఆధిపత్యంతో రాణించే స్ఫూర్తి సిద్ధిస్తుంది. అజ్ఞానంతో ప్రవర్తించే దుష్టులను హరించడంలో నేను, నా వాహనమైన సింహమూ సమాన ప్రయత్నంతో ఉంటామని ఈ సింహ వాహనోత్సవం ద్వారా స్వామివారు నిరూపిస్తున్నారు.
ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో  నటేష్బాబు, ఏఈవో  రామరాజు, ఇతర అధికార ప్రముఖులు, ఆలయ అర్చకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
సాంస్కృతిక కార్యక్రమాలు  :
 ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామస్వామివారి బ్రహ్మూెత్సవాల్లో మూడవ రోజైన సోమవారం టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్ ఆధ్వర్యంలో ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన ధార్మిక, సంగీత కార్యక్రమాలు భక్తిభావాన్ని పంచాయి. ఉదయం 7 నుంచి 8 గంటల వరకు ఎస్వీ సంగీత, నృత్య కళాశాల ఆధ్వర్యంలో మంగళధ్వని, ఉదయం 10 నుంచి 11 గంటల వరకు శ్రీమతి జ్యోతి ' శ్రీరామ వైభవం' అనే  అంశంపై ధార్మికోపన్యాసం చేశారు.  సాయంత్రం 6.00 నుంచి 7.00 గంటల వరకు కడపకు చెందిన శ్రీ వాణి అర్జున్ బృదం భక్తి సంగీత కార్యక్రమం జరుగనుంది. రాత్రి 7.00 నుండి 8.00 గంటల వరకు శ్రీ సుధాకర్ భాగవతార్ హరికథా పారాయణం చేయనున్నారు. 

No comments:
Write comments