గుళ్లు గోపురాలతో నేతలు

 

విజయవాడ, ఏప్రిల్ 15 (globelmedianews.com)
పోలింగ్ కి కౌంటింగ్ కి బాగా గ్యాప్ వచ్చింది. దాదాపు నెలన్నర రోజుల నిరీక్షణ తరువాత ఫలితాలు వెల్లడి కానున్నాయి. అప్పటివరకు గోళ్ళు కొరుక్కోవలిసిందే. అందుకే ప్రధాన పార్టీల అభ్యర్థులు గెలుపు ఆశలు వున్నవారు ఫ్యామిలీ టూర్స్ ప్లాన్ చేసుకుంటున్నారు. ముందు టికెట్ కోసం ఆ తరువాత ప్రచారం పగలు రాత్రి తేడా లేకుండా కష్ట పడిన అభ్యర్థులు కొంత రిలాక్స్ అయ్యారు. అయినా వారిలో టెన్షన్ మాత్రం పెరుగుతూ వస్తుంది.ఇదిగో ఎపి ఇంటలిజెన్స్ సర్వే. 


గుళ్లు గోపురాలతో నేతలు

అదిగో టిడిపి సర్వే తాజాగా వచ్చిన వైసిపి సర్వే ఇదిగో అంటూ సోషల్ మీడియా ద్వారా వస్తున్న నివేదికలు అభ్యర్థుల బిపి పెంచుతున్నాయి. దాంతో వారంతా గుళ్ళు గోపురాలు చుట్టూ తిరుగుతూ కనిపించిన దేవుడిని గెలిపించాలని ప్రార్థిస్తున్నారు. కొందరైతే చండి హోమాలు పూజలు భారీ ఎత్తునే చేస్తున్నారు. ఓటరు దేవుడు కరుణ తమపై ఉండేలా చూడాలని మొక్కుతున్నారు.కొందరు అభ్యర్థులు వేసవి తాపం వంట్లో పెరుగుతున్న వత్తిడి తట్టుకునేందుకు కులుమనాలి, కొడైకెనాల్ వంటి ప్రాంతాలకు టూర్స్ ను కుటుంబ సభ్యులతో ప్లాన్ చేసుకోవడం గమనార్హం. ఒక పది రోజుల పాటు ఎక్కడికైనా వెళితే టెన్షన్ తగ్గుతుందన్న యోచనలో ఉన్నారు నాయకులు. నియోజకవర్గాల్లో ఉంటే లేనిపోని టెన్షన్స్ తప్ప ఏమి ఉండవని కొందరు మరికొందరు ఎన్నికల్లో చేసిన అప్పులోళ్లనుంచి తప్పించుకునేందుకు లాంగ్ టూర్స్ లో బిజీ కావడం విశేషం.

No comments:
Write comments