స్పందించిన పంచాయితీ అధికారులు

 

కౌతాళం, ఏప్రిల్ 22, (globelmedianews.com
కాలని వాసులు సమస్యలు మా వరకు తీసుకొని వస్తె వెంటనే చర్యలు తీసుకుంటామని పంచాయితీ అధికారి నరసింహ రెడ్డి తెలిపారు. బిస్మిల్లా సర్కిల్, అంజనేయ స్వామి సర్కిల్  బంగారము షాపు సర్కిల్ ,దగ్గర డ్రైనేజీ కాలువలో చెత్త చెదారం లను కుప్పలుగా పేర్చి  కాలువలను శుభ్ర పరిచారు. డ్రైనేజీ కాలువలో ప్లాస్టిక్ కవర్లు పేపర్లు ఎక్కువగా ఉన్నాయని అందువల్ల నీరు ముందుకు పోవడం లేదని, కాలని వాసులకు టీస్టాల్ వారికి తేమ చెత్తను ఒక వైపు పుడి చెత్తను , చెత్త కుండీలో వేయాలని కోరారు. 


స్పందించిన పంచాయితీ అధికారులు

టీ గ్లాస్ లు ప్లాసిక్ పేపర్లు డ్రైనేజీ కాలువలో వేయరాదని సూచించారు. డ్రైనేజీ కాలువలో పూడికను తీసి అంటువ్యాధులు ప్రబలకుండా బ్లీచింగ్ పౌడర్ ను చల్లారు. రెండు రోజుల్లో చెత్తను ట్రాక్టర్ సహాయంతో ఉరి బయటకు పరవేస్తమని తెలిపారు. వైఎస్ఆర్ కాలనీలో నీరు వృధా కు మరమ్మతులు నీరు వృధాగ పోతున్నాయి అని వెంటనే స్పందించి ప్రొక్లైన్ సహాయం మట్టిని తీసి మరమ్మతు పనులు చేయించారు. కాలని వాసులు పబ్లిక్ ట్యాబ్ అడుగగా పంచాయితీ సెక్రటరీ నరసింహ రెడ్డి స్పందించి ఇప్పటికి  ఎవరికైనా నీళ్ళ కొలైలు కావాలంటే ఇస్తామన్నారు. పబ్లిక్ ట్యాబ్ లు   కొత్త సర్పంచ్ రాగానే అమరుస్తమని తెలిపారు. సమస్యలు ఉంటే మా పంచాయితీ  కార్యాలయంలో తెలపాలని కోరారు.

No comments:
Write comments